News November 10, 2024
చండ్రుగొండ : హాస్టల్లో పాము కలకలం

చండ్రుగొండ ఎస్సీ బాలుర వసతి గృహంలో పాము ప్రత్యక్షమైంది. హాస్టల్ బాత్రూంలో నుంచి పాము బయటకు వస్తున్న క్రమంలో స్థానికులు గుర్తించారు. ఆ సమయంలో హాస్టల్లో కేవలం ఐదుగురు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. మిగతావారు పాఠశాలలకు రెండు రోజులు సెలవులు ఇవ్వడంతో ఇళ్లకు వెళ్లినట్లు సమాచారం. అయితే హాస్టల్ పరిసర ప్రాంతం పిచ్చి మొక్కలు చెత్తాచెదారంతో నిండి ఉంటుందని స్థానికులు చెప్పారు. శుభ్రం చేయించాలని కోరారు.
Similar News
News November 7, 2025
ఖమ్మం: పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ‘వందే మాతరం’

జాతీయ గీతం ‘వందేమాతరానికి’ 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఖమ్మం పోలీస్ హెడ్ క్వాటర్స్ పరేడ్ గ్రౌండ్స్, అన్ని పోలీస్ స్టేషన్లలో వందే మాతరం జాతీయ గేయాన్ని సామూహికంగా ఆలపించే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పోలీస్ అధికారులందరూ పాల్గొన్నారు. ఈ వేడుకలు ఏడాది పొడవునా దేశవ్యాప్తంగా జరగనున్నాయని పోలీస్ అధికారులు తెలిపారు.
News November 7, 2025
కూసుమంచి: పంట నష్టం నమోదుకు పడవ ప్రయాణం

కూసుమంచి మండలం పాలేరు క్లస్టర్ ఏఈవో సాయిరాం తన వృత్తి నిబద్ధతను చాటారు. తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పొలాలను పరిశీలించేందుకు దారి లేకపోవడంతో, ఆయన ఓ మత్స్యకారుని సహాయంతో పడవపై ప్రయాణించారు. పంట నష్టాన్ని నమోదు చేసి, రైతులకు న్యాయం చేయాలనే సంకల్పంతో ఈ సాహసం చేసిన ఏఈవో సాయిరామ్పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి
News November 6, 2025
పీఎం శ్రీ నిధులు సమర్థవంతంగా వినియోగించాలి: ఇన్చార్జ్ కలెక్టర్

పీఎం శ్రీ నిధులను అధికారులు సమర్థవంతంగా వినియోగించాలని ఇన్చార్జ్ జిల్లా కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ ఆదేశించారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో నిధుల వినియోగంపై జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో ఎంపికైన 28 పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, క్రీడా అభివృద్ధి, యూత్ ఎకో క్లబ్ ఏర్పాటు, పరిశ్రమల విజిట్ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.


