News November 10, 2024
చండ్రుగొండ : హాస్టల్లో పాము కలకలం
చండ్రుగొండ ఎస్సీ బాలుర వసతి గృహంలో పాము ప్రత్యక్షమైంది. హాస్టల్ బాత్రూంలో నుంచి పాము బయటకు వస్తున్న క్రమంలో స్థానికులు గుర్తించారు. ఆ సమయంలో హాస్టల్లో కేవలం ఐదుగురు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. మిగతావారు పాఠశాలలకు రెండు రోజులు సెలవులు ఇవ్వడంతో ఇళ్లకు వెళ్లినట్లు సమాచారం. అయితే హాస్టల్ పరిసర ప్రాంతం పిచ్చి మొక్కలు చెత్తాచెదారంతో నిండి ఉంటుందని స్థానికులు చెప్పారు. శుభ్రం చేయించాలని కోరారు.
Similar News
News December 14, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు
> అశ్వారావుపేటలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన > కొత్తగూడెం కోర్టులో జాతీయ లోక్ అదాలత్ > పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన > న్యాయవాదులకు ఉచిత వైద్య శిబిరం > డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన > బూర్గంపాడు: విద్యుత్ సరఫరాకు అంతరాయం > ఖమ్మంలో సీపీఎం నిరసన
News December 14, 2024
మంత్రి పొంగులేటి నేటి పర్యటన వివరాలు
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నేడు పాలేరు నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు మంత్రి క్యాంపు కార్యాలయం ఇన్‌ఛార్జి తంబూరు దయాకర్ రెడ్డి శుక్రవారం తెలిపారు. పర్యటనలో భాగంగా ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూసుమంచి మండలంలోని నాయకన్ గూడెం, పెరికాసింగారం, తిరుమలయపాలెం మండలం మాదిరిపురంలలో జరుగే వివిధ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొంటారని వివరించారు.
News December 14, 2024
ఖమ్మం: ఓటర్ జాబితా సవరణ పారదర్శకంగా చేపట్టాలి : ఎన్నికల అధికారి
ఓటర్ జాబితా సవరణ కార్యక్రమాన్ని అధికారులు పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఓటర్ సవరణ జాబితా 2025పై ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్‌తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు. అర్హులైన ప్రతిఒక్కరికి ఓటు హక్కు కల్పించాలన్నారు. ఓటరు జాబితా నుంచి పేరు తొలగించే సమయంలో నిబంధనలను పాటించాలని పేర్కొన్నారు.