News April 20, 2025
చందనోత్సవానికి 500 కేజీల చందనం చెక్కలు సిద్ధం

ఏప్రిల్ 30న సింహాచలంలో జరగనున్న చందనోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఈవో సుబ్బారావు ఆదివారం తెలిపారు. ఈనెల 24న మొదటి విడత చందనం అరగదీతను ప్రారంభించనున్నట్లు తెలిపారు. దీని కోసం కావాల్సిన 500 కేజీల చందనపు చెక్కలను ఆదివారం సిద్ధం చేశారు. ఈనెల 24 ఉదయం 6:30కు చందనం అరగదీత మొదలవుతుందని, 7:30 తర్వాత దర్శనాలు ప్రారంభమవుతాయన్నారు.
Similar News
News April 21, 2025
విశాఖలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

ద్వారకానగర్‌లో ఎస్టీ, ఎస్సి విద్యార్థుల ఉచిత డీఎస్సీ కోచింగ్ సెంటర్‌లో సీఎం చంద్రబాబు చిత్రపటానికి డీఎస్సీ అభ్యర్థులు పాలాభిషేకం చేశారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవరావు, తదితరులు పాల్గొన్నారు.
News April 20, 2025
గాజువాకలో బెట్టింగ్ ముఠా అరెస్ట్

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీ పర్యవేక్షణలో బెట్టింగ్ ముఠాను ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. గాజువాక పరిధిలో బీహెచ్‌పీవీ వద్ద బెట్టింగ్ ఆడుతున్నట్లు సమాచారం రావడంతో నలుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 23 సెల్ ఫోన్లు, మూడు ల్యాప్‌టాప్స్ స్వాధీనం చేసుకున్నారు. ఎప్పటి నుంచి ఈ వ్యవహారం సాగుతుందో ఆరా తీస్తున్నారు. కమిషనర్ ఏర్పాటు చేసిన స్పెషల్ టీం ఈ దాడులు చేసింది.
News April 20, 2025
విశాఖ: ఒంటరితనం భరించలేక సూసైడ్

ఒంటరితనం భరించలేక ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖలో ఆదివారం చోటు చేసుకుంది. పీఎం పాలెం సెకండ్ బస్టాప్ సమీపంలోని ఓ అపార్ట్మెంట్‌లో మృతుడు నివస్తున్నాడు. తల్లిదండ్రులు, అన్నయ్య మృతి చెందడంతో ఒంటరిగా ఉన్న ఆయన మానసికంగా బాధపడుతూ ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న పీఎంపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం KGHకి తరలించారు.