News March 7, 2025
చందనోత్సవాన్ని విజయవంతం చేద్దాం: ఎమ్మెల్యే గంటా

ప్రభుత్వానికి పేరు తెచ్చేలా సింహాద్రి అప్పన్న చందనోత్సవం జరగాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. సింహాచలం దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు తీసుకున్న దేవాదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ కె.సుబ్బారావు శుక్రవారం ఆయన్ని కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఏప్రిల్ 30న జరగనున్న చందనోత్సవాన్ని సవాలుగా తీసుకుని జిల్లా యంత్రాంగం సహకారంతో విజయవంతం చేద్దామన్నారు.
Similar News
News December 14, 2025
క్రమశిక్షణ గల పౌరులను అందించే పరిశ్రమ ఏయూ: గంటా

ఆంధ్రా యూనివర్సిటీ నైతిక విలువలు, క్రమశిక్షణ గల భావి పౌరులను తయారు చేసే పరిశ్రమ అని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. పూర్వ విద్యార్థుల వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏయూ అనేక మంది నాయకులు, క్రీడాకారులు, ప్రతిభావంతులను దేశానికి అందించిందన్నారు. విద్యార్థి దశలోనే లక్ష్యాన్ని నిర్ణయించుకుని కృషి చేయాలని సూచించారు. శతాబ్ది ఉత్సవాలను పండగ వాతావరణంలో నిర్వహించాలని కోరారు.
News December 13, 2025
‘రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించవలసిన బాధ్యత మనదే’

రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తూ.. మార్కెటింగ్ సదుపాయాలు చూపించవలసిన బాధ్యత కమిటీ ఛైర్మన్‌లపై ఉందని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ ఎం.విజయ సునీత అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన మార్కెటింగ్ కమిటీ ఛైర్మన్‌లు, డైరెక్టర్ల అవగాహన సదస్సు విశాఖలో నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా 9 జిల్లాలకు చెందిన మార్కెటింగ్ ఛైర్మన్లు, డైరెక్టర్లకు మార్కెటింగ్ అంటే ఏంటో ఆమె సమగ్రంగా వివరించారు.
News December 13, 2025
మారికవలస: పురుగులు మందు తాగి యువకుడి మృతి

మారికవలసలోని ఏపీటీడబ్ల్యూఆర్ పాఠశాలలో అవుట్ సోర్సింగ్ విధులు నిర్వహిస్తున్న ఉమా మహేశ్ (27) పురుగు మందు తాగి
శనివారం చనిపోయాడు. పాఠశాల ప్రధానోపాధ్యాయుని సమాచారంతో యువకుడి తండ్రి నారాయణరావు పాఠశాలకు చేరుకున్నారు. ఆయన ఫిర్యాదుతో పీఎంపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


