News March 14, 2025

చందుర్తి: చిన్నారి వామిక ఇక లేదు

image

చందుర్తి మండల కేంద్రానికి చెందిన మర్రి వామిక (16 నెలలు) అనే చిన్నారి చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందింది. వామిక గత పది రోజుల నుంచి బ్లడ్ ఇన్ఫెక్షన్‌తో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. వామికను బతికించడం కోసం దాతలు ముందుకు వచ్చి విరాళాలు అందజేశారు. అయినా వామిక బతకలేదు. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.

Similar News

News November 21, 2025

ఇతిహాసాలు క్విజ్ – 73

image

ప్రశ్న: యుద్ధంలో ఓడిపోతాం అనే భయంతో దుర్యోధనుడు భీష్ముడి దగ్గరకు వెళ్లి ‘మీరు పాండవులపై ప్రేమతో యుద్ధం సరిగ్గా చేయడం లేదు’ అని నిందిస్తాడు. అప్పుడు భీష్ముడు 5 బాణాలిచ్చి, వీరితో పంచ పాండవుల ప్రాణాలు తీయవచ్చు అని చెబుతాడు. మరి ఆ బాణాల నుంచి పాండవులు ఎలా తప్పించుకున్నారు?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం. ☛ మీకు జవాబు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. <<-se>>#Ithihasaluquiz<<>>

News November 21, 2025

HYD: నగరంలో పెరుగుతున్న చలి తీవ్రత

image

హైదరాబాద్‌లో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. కొన్ని ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా చలి రికార్డు సృష్టిస్తోంది. పటాన్‌చెరులో కనిష్ఠ ఉష్ణోగ్రతలు గురువారం సాధారణం కంటే 6.4 తక్కువగా నమోదైంది. రాజేంద్రనగర్‌లో 11.5, హయత్‌నగర్‌లో 12.6 నమోదు కాగా, సగటున గరిష్ఠ ఉష్ణోగ్రత 29.4, కనిష్ఠ ఉష్ణోగ్రత 13.1 డిగ్రీలుగా నమోదైంది.

News November 21, 2025

కామారెడ్డి: కస్తూర్బా విద్యార్థినికి పాముకాటు

image

రాజంపేటలోని కస్తూర్బా పాఠశాల విద్యార్థినికి పాముకాటుకు గురైంది. గమనించిన తోటి విద్యార్థులు, సిబ్బంది ప్రిన్సిపల్ శ్రీవాణికి చెప్పారు. దీంతో ఆమెను హుటాహుటిన కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న డీఈఓ రాజు అమ్మాయిని పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఆమెకు ఎలాంటి ప్రాణాపాయం లేదని ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు.