News April 9, 2025

చంద్రగిరిలో మైనర్ బాలిక పరువు హత్య..?

image

చంద్రగిరి(M) నరసింగాపురంలో దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నిఖిత(17)ను శుక్రవారం కన్న తల్లిదండ్రులే చంపి కననం చేసినట్లు సమాచారం. ప్రేమ వ్యవహారమే ఈ ఘటనకు కారణం అని తెలుస్తోంది. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Similar News

News November 17, 2025

ఉమ్మడి విశాఖ జిల్లాలకు 28 బంగారు పతకాలు

image

రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో ఉమ్మడి జిల్లాకు 28 బంగారు, 8రజతం, 12 కాంస్యం పతకాలు లభించాయి. ఈనెల15 నుంచి 16 వరకు కాకినాడ, సూర్యకళామందీర్ కళ్యాణమండపంలో రాష్ట్రస్థాయి జూనియర్, క్యాడిట్, సీనియర్ క్యొరుగి, ఫూమ్ సే తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలు జరిగాయి. ఈ ఛాంపియన్షిప్‌లో చోడవరం, అనకాపల్లి విద్యార్థులు ప్రతిభ చాటారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా తైక్వాండో అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ తెలిపారు.

News November 17, 2025

మంచిర్యాల: మహిళలు జాగ్రత్త.!

image

బైక్‌పై ప్రయాణించేటప్పుడు మహిళలు, అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి. బైక్ వెనకాల కూర్చునేటప్పుడు లేదా స్కూటీలు డ్రైవ్ చేసేటప్పుడు తప్పనిసరిగా వారు ధరించిన చున్నీలు, స్కార్ఫ్‌లు, చీరలు బైక్ వీల్స్‌లో పడకుండా సరి చూసుకోవాలి. పొరపాటున అవి చక్రంలో పడితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. నిన్న రాత్రి గోదావరిఖనిలో వేమనపల్లికి చెందిన లత చీర కొంగు వీల్‌లో చిక్కుకొని చనిపోయిన విషయం తెలిసిందే.

News November 17, 2025

తిరుచానూరు వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం

image

AP: తిరుపతి జిల్లాలోని తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి కార్తీక వార్షిక బ్రహ్మోత్సవాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఇవాళ ఉదయం ధ్వజారోహణం జరగగా, రాత్రి చిన్నశేష వాహన సేవ ఉంటుంది. 18న పెద్దశేష వాహనం, 19న ముత్యపు పందిరి వాహనం, 20న కల్పవృక్ష వాహనం, 21న పల్లకీ ఉత్సవం, 22న సర్వభూపాల వాహనం, రాత్రి గరుడ వాహనం, 23న సూర్యప్రభ వాహనం, 24న రథోత్సవం, 25న పంచమీతీర్థం, రాత్రి ధ్వజావరోహణంతో ఉత్సవాలు ముగుస్తాయి.