News January 28, 2025

చంద్రగిరిలో రోడ్డు ప్రమాదం..  క్లీనర్ స్పాట్ డెడ్

image

చంద్రగిరి మండలం, మామండూరు జాతీయ రహదారిపై రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. బైపాస్ రోడ్డులో పార్కింగ్ చేసి ఉన్న లారీని వెనుక నుంచి కోళ్లు లారీ ఢీకొట్టింది. దీంతో కోళ్లు లారీ క్లీనర్ వెంకటేశ్ క్యాబిన్‌లో చిక్కుకొని అక్కడికక్కడే మృతి చెందాడు.‌ డ్రైవర్ పరారయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కాలేజ్‌కు తరలించి కేసు నమోదు చేశారు.

Similar News

News January 7, 2026

సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు

image

<>CSIR<<>>-సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ 7 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు JAN 14 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MSc(ఎలక్ట్రానిక్స్/ఫిజిక్స్/ అప్లైడ్ ఫిజిక్స్/అప్లైడ్ ఎలక్ట్రానిక్స్), BE/BTech, ME/MTech, టెన్త్+డిప్లొమా (MLT/DMLT) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.ceeri.res.in

News January 7, 2026

ఖమ్మం: సీఎం సమక్షంలో మరో ముగ్గురు కార్పొరేటర్ల చేరిక

image

ఖమ్మంలో బీఆర్ఎస్ ముగ్గురు కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరారు. హైద్రాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి వీరికి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. మంత్రి తుమ్మల ఆధ్వర్యంలో వీరి చేరిక జరిగింది. ఇటీవల కాలంలో ఐదుగురు చేరగా.. ఇప్పుడు ముగ్గురు కార్పొరేటర్లు చేరారు. దీంతో 40 మంది కార్పొరేటర్లతో ఖమ్మం కార్పొరేషన్‌లో కాంగ్రెస్ బలంగా మారింది.

News January 7, 2026

విశాఖ: పరువు నష్టం దావా.. ఈనెల 21కి కేసు వాయిదా

image

తనపై ఓ పత్రిక ప్రచురించిన అసత్య కథనంపై పరువునష్టం దావా కేసులో భాగంగా మంత్రి నారా లోకేశ్ నేడు విశాఖ కోర్టుకు హాజరయ్యారు. మూడోసారి క్రాస్ ఎగ్జామినేషన్‌కు ఉదయం 11 గంటలకు కోర్టుకు రాగా.. మధ్యాహ్నం 3 గంటల వరకు కేసుకు సంబంధించి వాదనలు జరిగాయి. చివరకు న్యాయమూర్తి ఈనెల 21కి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు.