News May 24, 2024

చంద్రగిరిలో వ్యక్తి హత్య

image

చంద్రగిరి నియోజకవర్గంలో దారుణం చోటు చేసుకుంది. పనపాకం గ్రామం వద్ద గుర్తు తెలియని ఓ వృద్దుడు హత్యకు గురైనట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి.. రెండు రోజుల క్రితం ఘటన జరిగినట్లు నిర్థారించారు. ఎవరో తలపై దాడి చేసి హత్య చేశారని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. 

Similar News

News February 11, 2025

చిత్తూరు జిల్లా హెడ్‌లైన్స్

image

✒నగరి ఎమ్మెల్యే సోదరుడు వైసీపీలో చేరికకు బ్రేక్!
✒ పుంగనూరులో యువకుడి సూసైడ్
✒టీడీపీ ఎంపీలపై మిధున్ రెడ్డి ఫైర్
✒ 158 ఏళ్ల చరిత్ర కలిగిన మసెమ్మ జాతరరేపే ప్రారంభం
✒శ్రీవారి సేవలో సినీ నటుడు కార్తీ
✒SPMVV: ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
✒పెద్దిరెడ్డి ఓ దొంగ: MP శబరి

News February 11, 2025

నగరి ఎమ్మెల్యే సోదరుడు వైసీపీలో చేరికకు బ్రేక్!

image

టీడీపీ నేత, నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్ సోదరుడు గాలి జగదీశ్ వైసీపీలో చేరికకు తాత్కాలిక బ్రేక్ పడింది. రేపు వైసీపీలో చేరేందుకు మాజీ సీఎం జగన్‌తో వైసీపీ కేంద్ర కార్యాలయంలో భేటీ అయ్యారు. గాలి జగదీశ్ చేరికకు మాజీ మంత్రి రోజా అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో ఆయన చేరికను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో జగదీశ్ నగరి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

News February 11, 2025

158 ఏళ్ల చరిత్ర కలిగిన మసెమ్మ జాతర రేపే ప్రారంభం

image

పుంగనూరు(M) కొండచర్లకురప్పల్లె మసెమ్మ జాతరకు గ్రామస్థులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ జాతర ఈనెల12,13వ తేదీల్లో జరగనుంది. మసెమ్మ జాతరకు సుమారు 158 సంవత్సరాల చరిత్ర ఉంది. కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా కొలువై ఉండడంతో జిల్లా వాసులే కాకుండా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.

error: Content is protected !!