News March 23, 2025
చంద్రగిరి కోట అభివృద్ధికి గ్రహణం వీడేనా.?

ఉ.చిత్తూరు జిల్లా సిగలో మరో మణిహారం చంద్రగిరి కోట. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో నిర్మించిన ఈ కోట అలనాటి స్వర్ణయుగానికి ప్రతీక. శత్రు దుర్భేధ్యంగా నిర్మించిన బురుజులు, కోనేరు జిల్లాకే తలమానికం. కోటతోపాటూ అక్కడి మ్యాజియంలోని రాయలవారి వస్తువులను తిలకించడానికి ఎందరో పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. కోట అభివృద్ధికి అధికారులు మరిన్ని చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. మీరేమంటారో కామెంట్ చేయండి.
Similar News
News November 22, 2025
HYD: నిద్రావస్థలో.. నిఘా నేత్రం!

‘మేము సైతం’ నినాదంతో ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాల పర్యవేక్షణపై రాచకొండ కమిషనరేట్ పరిధిలోని బాలాపూర్ సీతాఎవెన్యూ కాలనీల్లో నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఒక్క కెమెరా వంద మంది పోలీసులతో సమానమైనా, వాటి నిర్వహణకు స్థానిక పోలీసులు శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఉగ్రవాదుల కదలికలు పెరుగుతున్న నేపథ్యంలో, సీసీ కెమెరాల వ్యవస్థపై పోలీస్ బాస్లు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
News November 22, 2025
HYD: నిద్రావస్థలో.. నిఘా నేత్రం!

‘మేము సైతం’ నినాదంతో ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాల పర్యవేక్షణపై రాచకొండ కమిషనరేట్ పరిధిలోని బాలాపూర్ సీతాఎవెన్యూ కాలనీతోపాటు మీర్పేట్ MLR కాలనీలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఒక్క కెమెరా వంద మంది పోలీసులతో సమానమైనా వాటి నిర్వహణకు పోలీసులు శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఉగ్రవాదుల కదలికలు పెరుగుతున్న నేపథ్యంలో సీసీ కెమెరాల వ్యవస్థపై పోలీస్ బాస్లు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
News November 22, 2025
పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్స్ జీవో విడుదల

TG: పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం జీవో 46ను విడుదల చేసింది. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని జీవోలో స్పష్టం చేసింది. SC, ST, BC, మహిళా రిజర్వేషన్లను రొటేషన్ పద్ధతిలో అమలు చేయనుంది. ST రిజర్వేషన్లు ఖరారయ్యాక SC, BC రిజర్వేషన్లు ఉంటాయి. రేపు సా.6 గంటల్లోపు ఖరారు చేసిన రిజర్వేషన్లను పంచాయతీరాజ్ శాఖకు కలెక్టర్లు అందించనున్నారు.


