News December 9, 2024

చంద్రగిరి: మహిళా అనుమానాస్పద మృతి

image

చంద్రగిరి మండలం ముంగిలపట్టులో కాసేపటి క్రితం ఓ గుర్తు తెలియని మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సాయంత్రం 6గంటల ప్రాంతంలో ఓ వ్యక్తితో కలిసి మహిళ ఏడుస్తూ కనిపించింది. చీకటి పడ్డాక నడి రోడ్డుపై రక్తపు మడుగులో మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News November 21, 2025

చిత్తూరు జిల్లా టీచర్లకు గమనిక

image

చిత్తూరు జిల్లాలోని మున్సిపల్, ఎయిడెడ్, పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లు HM అకౌంట్ టెస్టుకు ఈనెల 24వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో వరలక్ష్మి ఒక ప్రకటనలో సూచించారు. ఓ పేపర్‌కు రూ.100, 2పేపర్ల పరీక్ష రాసేందుకు రూ.150 చెల్లించాలన్నారు. రూ.60 అపరాధ రుసుముతో నవంబరు 30వ తేదీ లోపు చెల్లించాలని సూచించారు.

News November 21, 2025

చిత్తూరు: రాగుల పంపిణీకి చర్యలు

image

చిత్తూరు జిల్లాలోని రేషన్ షాపుల్లో డిసెంబరు నెల నుంచి రాగులు, జొన్నలు పంపిణీ చేయనున్నట్లు పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ లక్ష్మి తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం జిల్లాకు 350 టన్నుల జొన్నలు, 350 టన్నుల రాగులను కేటాయించిందన్నారు. చిరుధాన్యాల వినియోగాన్ని ప్రోత్సహించడంలో వీటిని పంపిణీ చేస్తామన్నారు. కార్డుదారులకి ఇస్తున్న బియ్యం కోటాలో ఒక్కొక్క కేజీ వంతున రాగులు, జొన్నలు అందజేస్తామని చెప్పారు.

News November 21, 2025

వివాదస్పదంగా కొందరు విలేకరుల తీరు.!

image

చిత్తూరు జిల్లాలో కొందరు <<18340244>>విలేకరులు దందాలకు<<>> పాల్పడుతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల ఇద్దరు విలేకరులు అగ్రికల్చరల్ మహిళా ఆఫీసర్‌ను బెదిరించగా కలెక్టర్ వారి అక్రిడిటేషన్ రద్దు చేశారు. తాజాగా GDనెల్లూరు సైతం ఇద్దరు విలేకరులు తనను బెదిరించారంటూ ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. ప్రజలకు అండగా ఉండాల్సిన విలేకరులే ఇలా అడ్డదారులు తొక్కుతుంటే ఎలా అని పలువురు మండిపడుతున్నారు.