News February 27, 2026
చంద్రబాబుకు ఆహ్వాన పత్రిక అందజేసిన భట్టి

ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడిని తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. మార్చి 5న హైదరాబాద్‌లో జరగనున్న తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుకకు హాజరుకావాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ భేటీలో తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు కూడా పాల్గొన్నారు. వివాహానికి ఆహ్వానించిన భట్టి విక్రమార్కకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News April 16, 2026
సుప్రీం లీడర్ బతికే ఉన్నారు: అమెరికా

ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ బతికే ఉన్నారని అమెరికా డిఫెన్స్ సెక్రటరీ హెగ్సెత్ ప్రకటించారు. అయితే ఆయనకు గాయాలయ్యాయని ప్రెస్‌మీట్‌లో పేర్కొన్నారు. ఇరాన్ తమతో డీల్ చేసుకోకుంటే మరోసారి దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. మరోవైపు అమెరికా-ఇరాన్ శాంతి చర్చల కోసం పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ మునీర్ ఇరాన్ ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు.
News April 16, 2026
GWL: చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి

గద్వాల చేనేత చీరలు ప్రపంచ ప్రసిద్ధి చెందాయని, నేత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ పేర్కొన్నారు. చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో గురువారం అనంత ఫంక్షన్ హాల్లో నేతన్న భరోసా, నేతన్న భద్రత పథకాలకు సంబంధించి చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, విజయుడుతో కలిసి పాల్గొన్నారు. జిల్లాలో 1761 మంది నేత కార్మికులకు రూ.11 కోట్ల రుణమాఫి చెక్కులు అందజేశారు.
News April 16, 2026
NZB: వ్యభిచార గృహంపై దాడి.. ముగ్గురి అరెస్ట్

నిజామాబాద్ నగరంలోని చంద్రశేఖర్ కాలనీలో ఓ అద్దె ఇంట్లో వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నరనే సమాచారంతో దాడి చేసినట్లు రూరల్ SHO శ్రీనివాస్ తెలిపారు. ఈ దాడిలో వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న న్యాలం శ్రీనివాస్, పాపి భూదేవితో పాటు ఒక విటుడిని, ఓ మహిళను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ముగ్గురిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించినట్లు SHO వివరించారు.


