News April 7, 2024
చంద్రబాబుకు మంత్రి అమర్నాథ్ సవాల్

బీజేపీతో జతకట్టిన చంద్రబాబు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకమని చెప్పగలరా అంటూ మంత్రి గుడివాడ అమర్నాథ్ సవాల్ విసిరారు. గాజువాక మండలం నడుపూరులో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో చంద్రబాబు ఎందుకు స్పందించలేదన్నారు.
Similar News
News April 10, 2025
భీమిలి మార్కెటింగ్ మాజీ ఛైర్మన్ ఆత్మహత్య

విశాఖలో టీడీపీ నాయకుడు కోరాడ నాగభూషణం గురువారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నారు. ఆరిలోవ సీఐ మల్లేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. భీమిలి మార్కెటింగ్ మాజీ ఛైర్మన్ కోరాడ నాగభూషణం ఆరిలోవ హెల్త్ సిటీలోని ఓ ఆస్పత్రిలో రెండు రోజుల క్రితం చేరారు. ఈ రోజు ఉదయం ఆస్పత్రి 4వ అంతస్తు నుంచి దూకి చనిపోయినట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
News April 10, 2025
విశాఖలో మరో ప్రేమోన్మాది దాడి

విశాఖలో మరో ప్రేమోన్మాది బాలిక తల్లిపై కత్తితో దాడి చేశాడు. ఫోర్త్ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాజువాకకు చెందిన ఇంటర్ విద్యార్థి, అక్కయ్యపాలెంకు చెందిన బాలిక ప్రేమించుకున్నారు. బాలికకు పెళ్లి సంబందాలు చూస్తున్నారని యువకుడు 7వ తేదీన ఆమె ఇంటికి వెళ్లి తల్లిపై కత్తితో దాడి చేశాడు. ఆమె గాయపడగా ఆస్పత్రికి తరలించారు. ఫిర్యాదు మేరకు పోలీసులు బుధవారం రాత్రి యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.
News April 10, 2025
మురళి నగర్‌లో యథావిధిగా మాంసం విక్రయాలు

మహావీర్ జయంతి సందర్భంగా మాంసం దుకాణాలు, జంతు వధ నిషేధమని విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. మహావీర్ జయంతి నాడు మాంసం దుకాణాలు తెరచినా, జంతు వధ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయినప్పటికీ కలెక్టర్ ఆదేశాలను లెక్కచేయకుండా మురళి నగర్‌లో యథావిధిగా మాంసం విక్రయాలు జరుగుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ కొరవైందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.