News March 29, 2024
చంద్రబాబుకు రాచమల్లు బహిరంగ లేఖ

TDP ప్రభుత్వ హయాంలో 2014 – 2019 వరకు ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలో ఏ అభివృద్ధి చేశారో TDP అధినేత చంద్రబాబునాయుడు చెప్పాలని ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. శుక్రవారం ప్రొద్దుటూరులో ఆయన మాట్లాడుతూ 2014-19 సంవత్సరాల్లో ప్రొద్దుటూరు TDP ఇన్‌ఛార్జ్‌గా వరదరాజుల రెడ్డి ఉన్నారన్నారు. ఆ సమయంలో నియోజకవర్గానికి ఏమి అభివృద్ధి చేయలేదని విమర్శించారు.
Similar News
News May 8, 2025
పెండ్లిమర్రిలో రోడ్డు ప్రమాదం.. మృతులు వీరే

పెండ్లిమర్రి మండలంలోని కొత్తూరు వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులను వేంపల్లి శ్రీరాంనగర్‌కు చెందిన బాలయ్య, రాజీవ్ నగర్‌కు చెందిన మల్లికార్జున, మదనపల్లెకి చెందిన మల్లికార్జునగా స్థానికులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News May 8, 2025
పెండ్లిమర్రిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

పెండ్లిమర్రి మండలం కొత్తూరు వద్ద గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. బైక్‌ను కంటైనర్ ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన మరొకరు వేంపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News May 8, 2025
కడప: రిమ్స్ ప్రిన్సిపల్‌గా డాక్టర్ జమున

కడప రిమ్స్ మెడికల్ కళాశాల నూతన ప్రిన్సిపల్‌గా డాక్టర్ జమున గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఉదయం కళాశాల సిబ్బంది ఆమెకు ఘనంగా స్వాగతం పలికి బొకేలు అందజేశారు. రిమ్స్ మెడికల్ కళాశాల అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె అన్నారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటానని పేర్కొన్నారు.