News June 10, 2024
చంద్రబాబుతో దామచర్ల భేటీ.. మంత్రి పదవి ఖాయమేనా?

పార్టీ అఖండ విజయం సాధించడంతో పాటు బుధవారం సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో.. టీడీపీ అధినేత చంద్రబాబును ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అమరావతిలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కాగా చంద్రబాబుతో భేటీ నేపథ్యంలో దామచర్లకు మంత్రి పదవి ఖాయమనే చర్చ మొదలైంది. పార్టీ కష్టకాలంలోనూ వెన్నంటే నడిచిన దామచర్ల కుటుంబానికి.. నిన్న కింజరాపు కుటుంబానికి దక్కిన గౌరవం దక్కుతుందని పార్టీ కేడర్ భావిస్తోంది.
Similar News
News February 24, 2026
రేపు మార్కాపురం జిల్లాకు CM.. షెడ్యూల్ ఇదే.!

CM చంద్రబాబు బుధవారం మార్కాపురం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన పర్యటన షెడ్యూల్ CMO అధికారులు విడుదల చేశారు. రేపు మధ్యాహ్నం 12:50కి దోర్నాలలోని వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ పనులకు శంకుస్థాపన చేసి, పనులను పరిశీలించి మధ్యాహ్నం 2 గంటల వరకు అక్కడే ఉంటారు. మధ్యాహ్నం 2:30కి మార్కాపురంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం 4:40కి తిరిగి వెలగపూడికి బయలుదేరుతారు.
News February 24, 2026
ఒంగోలు: ‘మీకోసం’కు 75 ఫిర్యాదులు

ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలనే లక్ష్యంగా సోమవారం ఒంగోలులోని పోలీస్ కార్యాలయంలో మీకోసం కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను పోలీస్ అధికారులకు ప్రత్యక్షంగా వివరించారు. ప్రతి ఫిర్యాదుదారుతో అధికారులు ముఖాముఖీ మాట్లాడి వారి సమస్యల వివరాలను తెలుసుకున్నారు. మీకోసం కార్యక్రమానికి 75 ఫిర్యాదులు అందాయని త్వరగా పరిష్కరించాలన్నారు.