News August 12, 2024

చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం భేటీ

image

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం భేటీ అయింది. ఈ మేరకు రాజధాని అమరావతి నిర్మాణంపై చర్చించింది. గత రెండు రోజులుగా అమరావతిలో పర్యటిస్తున్న ఈ బృందం.. రాజధాని ప్రాంతంలోని భవనాలు, రహదారులను పరిశీలించింది. ప్రపంచంలోని ఉత్తమ ప్రమాణాలు, ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి అమరావతి నిర్మిస్తున్నామని ఆ బృందానికి సీఎం వివరించారు.

Similar News

News September 16, 2024

గుంటూరు: నారాకోడూరు వద్ద రోడ్డు ప్రమాదం

image

గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. వినాయక నిమజ్జనానికి వెళ్లి తిరిగి వస్తుండగా టాటా ఏస్ వాహనం చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో 15 మందికి గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి చెట్టును ఢీకొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 16, 2024

ప్రేమ, దయ భావనలతో ఉండాలి: చంద్రబాబు

image

ప్రపంచంలో శాంతిపూర్వక మానవ సమాజాన్ని నెలకొల్పేందుకు తన జీవితాన్ని అంకితం చేసిన కారణజన్ముడు మహమ్మద్ ప్రవక్త అని సీఎం చంద్రబాబు అన్నారు. ఆయన జన్మదినాన్ని అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్న ముస్లిం సోదరులకు చంద్రబాబు మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ సాటివారి పట్ల ప్రేమ, దయ, భావనలతో ఉన్నప్పుడే ప్రవక్త కోరుకున్న శాంతియుత సమాజం నెలకొంటుందని అన్నారు.

News September 16, 2024

గుంటూరు జిల్లాలో పలువురు డీఎస్పీల బదిలీ

image

గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పలువురు డీఎస్పీలు బదిలీ అయ్యారు. ఈ మేరకు డీజీపీ ద్వారకాతిరుమల రావు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. విఆర్ లో ఉన్న ఎం.రమేశ్‌ను గుంటూరు ట్రాఫిక్‌కు, గుంతకల్‌లో ఉన్న షేక్ అబ్దుల్ అజీజ్‌ను గుంటూరు తూర్పునకు, పీసీఎస్‌లో ఉన్న ఎం. హనుమంతరావును సత్తెనపల్లికి, ఎమ్మిగనూర్‌లో ఉన్న బి.సీతారామయ్యను గుంటూరు జిల్లా స్పెషల్ బ్రాంచ్‌కు బదిలీ చేశారు.