News June 28, 2024
చంద్రబాబును కలిసిన పల్లా దంపతులు
టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని చేపట్టిన అనంతరం మంగళగిరి పార్టీ కార్యాలయంలో పల్లా శ్రీనివాసరావు దంపతులు చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావుకు చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేసి అభినందించారు. పార్టీ కార్యకర్తల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు ఈ సందర్భంగా సూచించారు. ప్రభుత్వాన్ని పార్టీని సమన్వయం చేస్తూ పని చేయాలన్నారు.
Similar News
News October 11, 2024
మంత్రి లోకేశ్‌ను కలిసిన ఎమ్మెల్యే గంటా
విశాఖపట్నంలో అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్ రావడానికి మంత్రి లోకేశ్ కృషి చేశారని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం ఆయన్ను కలిసి పలు విషయాలపై చర్చించారు. ఈ కంపెనీ ద్వారా పదివేల మందికి ఉపాధి అవకాశం దొరుకుతుందని, విద్యా, ఫార్మా, టూరిజం వంటి అభివృద్ధి చెందుతాయన్నారు. నగరంలో మెట్రో ఏర్పడే సమయాని ఫ్లైఓవర్లు, కారిడార్లు వంటి వాటిపై దృష్టి సారించాలని మంత్రిని గంటా కోరారు.
News October 11, 2024
అప్పుడే విశాఖ ఉక్కుకు మంచి రోజులు: గుడివాడ
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. టీడీపీ మద్దతుతో కేంద్ర ప్రభుత్వం మనుగడ సాగిస్తోందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించవద్దని అల్టిమేటం ఇవ్వాలని కోరారు. అప్పుడే విశాఖ ఉక్కుకు మంచి రోజులు వస్తాయని అన్నారు.
News October 11, 2024
భీమిలిలో మానసిక రోగిపై అత్యాచారం..!
భీమిలికి చెందిన ఓ మానసిక రోగిపై ఈనెల 3న అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు లేని సమయంలో మతిస్థిమితం లేని అమ్మాయిని ఓ యువకుడు స్కూటీపై గొట్లాం తీసుకువెళ్లి అత్యాచారం చేసి వదిలేశాడు. స్కూటీని ఆమెను స్థానికులు గమనించి విజయనగరం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు భీమిలి పోలీసులకు అప్పగించారు. విచారణ అనంతరం కేసును మహిళా పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.