News June 29, 2024
చంద్రబాబును కలిసిన TDP రాష్ట్ర అధ్యక్షుడు పల్లా
తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా శుక్రవారం గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు యాదవ్ మంగళగిరి టీడీపీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం టీడీపీ అధినేత ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిని ఉండవల్లిలో ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. పల్లా శ్రీనివాసరావు సమర్థ నాయకత్వంలో పార్టీ మరెన్నో విజయాలను సాధిస్తుందని, మరింత బలోపేతం అవుతుందని ఆశిస్తున్నట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Similar News
News December 10, 2024
13న స్వర్ణాంధ్ర @ 2047కి శ్రీకారం: కలెక్టర్
విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియం వేదికగా ఈనెల 13వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రినారా చంద్రబాబు నాయుడిచే స్వర్ణాంధ్ర @ 2047కి శ్రీకారం చుట్టడం జరుగుతుందని కలెక్టర్ డా.జి.లక్ష్మిశా తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే సభకు సుమారు 25వేల మంది ప్రజలు హాజరు కానున్నారని వెల్లడించారు. ఈ మేరకు సోమవారం అధికారులతో సమావేశమయ్యారు. జిల్లా అధికారులు సమన్వయంతో కృషి చేసి కార్యక్రమం విజయవంతం చేయాలని ఆదేశించారు.
News December 10, 2024
గుడివాడ: కళాశాలకు వెళ్లి తిరిగిరాని మైనర్ బాలిక
గుడివాడ కేటీఆర్ మహిళా కళాశాల వద్ద ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్మెన్‌గా ఉన్న దుర్గారావు కుమార్తె ప్రియాంక అదృశ్యమైనట్లు కుటుంబీకులు తెలిపారు. పాలిటెక్నిక్ ఫస్టియర్ చదువుతున్న యువతి, శనివారం కాలేజీకి వెళ్లి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. అయితే అదే అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న వివాహితుడు రాహుల్‌పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మిస్సింగ్ పై టూ టౌన్ స్టేషన్లో కేసు నమోదైనట్లు తెలిపారు.
News December 10, 2024
తిరువూరు నుంచి Dy.CM పవన్‌కు బెదిరింపు కాల్స్
Dy.CM పవన్ కళ్యాణ్ కు బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తి తిరువూరుకు చెందిన మల్లికార్జున రావుగా పోలీసులు గుర్తించారు. ఇతను పవన్ ఓఎస్డీకి ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడినట్లు ఫిర్యాదులు అందగా..పోలీసులు రంగంలోకి దిగారు. ఎంజీ రోడ్డు నుంచి ఫోన్ కాల్ వచ్చినట్లు గుర్తించారు. అయితే ఆ ఏరియాలో ఆరా తీయగా అతని జాడలేదు.అతనే ఫోన్ చేశాడా.. ఎవరైనా అతని పేరుపై సిమ్ తీసుకున్నారా అని తెలియాల్సి ఉంది.