News December 7, 2024
చంద్రబాబుపై నమ్మకంతోనే రాష్ట్రానికి పెట్టుబడులు: మంత్రి బీసీ

సీఎం చంద్రబాబు నాయుడుపై నమ్మకంతోనే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు తరలివస్తున్నారని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కర్నూలు కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఆయన మాట్లాడారు. రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో గుంతలు పడ్డ రోడ్లకు మరమ్మతులు చేపడుతున్నామని చెప్పారు. ఇందు కోసం ఇప్పటికే నిధులను కేటాయించామన్నారు. త్వరలోనే పనులు పూర్తవుతాయని తెలిపారు.
Similar News
News October 15, 2025
‘మీ ప్రతి పైసా సురక్షితం’

ప్రతీ వ్యక్తికి జీవిత బీమా అందించాల్సిన బాధ్యత LICపై ఉందని, అది ప్రతీ LIC ఏజెంట్ బాధ్యతగా తీసుకొని ముందుకు వెళ్లాలని కడప డివిజన్ సీనియర్ మేనేజర్ రవికుమార్ పేర్కొన్నారు. మంగళవారం ఎమ్మిగనూరు LIC బ్రాంచ్ కార్యాలయంలో ఏజెంట్లతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. LICలో పెట్టే ప్రతి పైసా సురక్షితమైనదన్నారు.
News October 14, 2025
ప్రధాని మోదీ పర్యటనకు 3,300 బస్సులు: మంత్రి

ప్రధాని మోదీ పర్యటనకు 3,300 బస్సులు ఏర్పాటు చేసినట్లు రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై అధికారులతో కర్నూలులో సమీక్ష, పర్యవేక్షణ చేపట్టారు. కర్నూలు సభకు 3,070, శ్రీశైలానికి 150, భద్రతా సిబ్బందికి 80 బస్సులు కేటాయించామన్నారు. పూర్తి ఫిట్నెస్ బస్సులనే వినియోగిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.
News October 14, 2025
జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో కర్నూలుకు బంగారు పతకాలు

ఈనెల 10 నుంచి 14 వరకు భువనేశ్వర్లో నిర్వహించిన జాతీయ స్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో అండర్-20 విభాగంలో కర్నూలుకు చెందిన అథ్లెట్ మొగిలి వెంకట్రామిరెడ్డి ఏపీ తరఫున పాల్గొని బంగారు పతకాలు సాధించాడు. 800, 1500 మీటర్ల పరుగు పోటీల్లో ఈ ఘనత సాధించిన వెంకట్రామిరెడ్డిని అథ్లెటిక్స్ అసోసియేషన్ క్రీడా ప్రతినిధులు హర్షవర్ధన్ మంగళవారం ఓ ప్రకటనలో అభినందించారు.