News November 20, 2024

చంద్రబాబు అరెస్ట్‌కు కుట్ర: MLA కోటం రెడ్డి

image

CMపైనే కుట్రలు జరుగుతుంటే సామాన్యుల పరిస్థితి ఏంటని అసెంబ్లీలో MLA కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిలదీశారు. ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని ఆయన ప్రస్తావిస్తూ.. చంద్రబాబు అరెస్ట్‌కు వైసీపీ హయాంలో పెద్ద కుట్రే జరిగిందని ఆరోపించారు. తక్షణమే దీనిపై స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. డిప్యూటీ స్పీకర్ RRR స్పందిస్తూ.. ఇది జీరో అవర్ అని.. ఇక్కడ సమాధానాలు ఉండవన్నారు. దీనిపై తరువాత చర్చిద్దాం అంటూ ఆయన తెలిపారు.

Similar News

News December 6, 2024

నెల్లూరు జిల్లాలో ‘పుష్ప-2’ అరుదైన రికార్డ్

image

అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2’ సినిమా నెల్లూరు జిల్లాలో ఓ అరుదైన రికార్డ్ నమోదు చేసింది. జిల్లా వ్యాప్తంగా 58 థియేటర్లలో ప్రీమియర్స్‌తో కలిపి మొదటి రోజు పూర్తి అయ్యే సమయానికి ఒక్కో థియేటర్‌లో 8 షోల చొప్పున 464 షోలు ప్రదర్శితమయ్యాయి. జిల్లాలో ఇప్పటి వరకు ఇదే అత్యధికం. దీంతో మొదటి రోజు నుంచే ‘పుష్ప-2’ రికార్డులు మొదలయ్యాయని అభిమానులు సంబరపడుతున్నారు.

News December 6, 2024

పండగ వాతావరణంలో మెగా PTM ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

image

డిసెంబర్ 7న నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మెగా టీచర్ పేరెంట్ మీటింగ్ ఏర్పాటుకు సంబంధించి పూర్తి చేసినట్లు కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. ఈ కార్యక్రమం జిల్లావ్యాప్తంగా పండగ వాతావరణంలో జరిగేలా ఇప్పటికే సంబంధిత విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. రేపటి నుంచి జనవరి 8వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

News December 5, 2024

నాయుడుపేటలో  సినీ నటుడు సత్య ప్రకాశ్ పూజలు

image

నాయుడుపేటలో స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్న శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి దేవాలయం, ఉమామహేశ్వర దేవాలయాలను గురువారం ప్రముఖ సినీ నటుడు సత్య ప్రకాశ్ దర్శించుకొని, పూజలు నిర్వహించారు. అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయన కుటుంబ సభ్యులతో విచ్చేశారు. ఈ దేవాలయాల సందర్శన పవిత్ర పుణ్య క్షేత్రం తిరుమల, శ్రీశైలం క్షేత్రంను దర్శించుకున్నట్లు ఉందని సత్య ప్రకాశ్ అన్నారు.