News March 22, 2024

చంద్రబాబు కుప్పం పర్యటనలో మార్పు

image

చంద్రబాబు కుప్పం పర్యటనలో మార్పులు జరిగాయి. తమ అధినేత పర్యటన ఒక్క రోజు వాయిదా పడినట్లు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తెలిపారు. ఈనెల 24, 25న బదులు.. 25, 26న కుప్పం నియోజకవర్గంలో బాబు పర్యటిస్తారని చెప్పారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు మార్పులు గమనించాలని ఆయన కోరారు.

Similar News

News December 27, 2025

చిత్తూరు కలెక్టరేట్‌లో వీర్ బాల దివస్ పోస్టర్ల ఆవిష్కరణ

image

దేశ భవిష్యత్తుకు పిల్లలే పునాది అని కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. కలెక్టర్ ఛాంబర్‌లో శనివారం ఆయన వీర్ బాల దివస్ పోస్టర్లను ఆవిష్కరించారు. యువతలో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం పెంపొందించడం, దేశాభివృద్ధిలో చురుగ్గా పాల్గొనేలా చేయడమే వికసిత భారత్ లక్ష్యమన్నారు. జిల్లాలోని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, కాలేజీల్లో భారత బాలశక్తి @ 2047 వేడుకలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు.

News December 27, 2025

చిత్తూరు: GST స్కాంలో రూ.118.70 స్వాహా (2)

image

☞ MF ఎంటర్ప్రైజెస్- రూ.9.06 కోట్లు ☞ IB ట్రేడర్స్-రూ.2.04 కోట్లు, రూ.2.16 కోట్లు ☞AR స్టీల్స్-రూ.3.11 కోట్లు ☞ ZF ట్రేడర్స్- రూ.4.59 కోట్లు, ☞ ముజు మెటల్స్-రూ.5.73 కోట్లు ☞ అబ్రార్ టుడే ఫ్యాషన్ మాల్- రూ.5.36కోట్లు. ఈ స్కాంలో రాష్ట్రంలోనే చిత్తూరు మొదటి స్థానంలో నిలిచింది.

News December 27, 2025

చిత్తూరు జిల్లాలో 1,016 మందికి అబార్షన్లు..!

image

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అబార్షన్ల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో 2025-26 (ఏప్రిల్ నుంచి డిసెంబర్‌)లో 20,824 మంది గర్భిణులుగా లెక్కల్లోకి ఎక్కారు. మొదటిసారి గర్భం దాల్చిన వారు 8,007 మందికాగా, రెండోసారి, అంతకుమించి గర్భవతులు 12,816 మంది. వీరిలో ఇప్పటి వరకు 1,016 మంది అబార్షన్లు చేసుకున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఇవన్నీ క్షేత్ర స్థాయిలో వైద్య సిబ్బంది గుర్తించినవి మాత్రమే.