News March 22, 2024

చంద్రబాబు కుప్పం పర్యటనలో మార్పు

image

చంద్రబాబు కుప్పం పర్యటనలో మార్పులు జరిగాయి. తమ అధినేత పర్యటన ఒక్క రోజు వాయిదా పడినట్లు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తెలిపారు. ఈనెల 24, 25న బదులు.. 25, 26న కుప్పం నియోజకవర్గంలో బాబు పర్యటిస్తారని చెప్పారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు మార్పులు గమనించాలని ఆయన కోరారు.

Similar News

News September 12, 2024

చిత్తూరు: కౌన్సిలింగ్ ద్వారా పోస్టింగులు

image

గ్రామ, వార్డు మహిళా పోలీసులకు కౌన్సిలింగ్ ద్వారా పోస్టింగ్లు ఇచ్చినట్టు ఎస్పీ మణికంఠ తెలిపారు. జిల్లా పోలీసు శాఖ కార్యాలయంలో బుధవారం జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించిన కౌన్సిలింగ్ కు 140 మంది హాజరయ్యారు. ప్రభుత్వం నిర్దేశించిన నియమ నిబంధనలను ఎస్పీ వారికి వివరించారు. వారి అభీష్టం మేరకు 49 మందికి పోస్టింగ్ కేటాయించారు. డిపిఓ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ మోహన్ రావు పాల్గొన్నారు.

News September 11, 2024

వైద్యపరీక్షలకు హాజరైన ఎమ్మెల్యే ఆదిమూలం బాధితురాలు

image

సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం తనను లైంగికంగా వేధించారని ఆరోపణలు చేస్తున్న బాధిత మహిళ ఇవాళ వైద్యపరీక్షలకు హాజరైంది. తిరుపతిలోని ప్రసూతి వైద్యశాలలో అడ్మిట్ అయింది. ఆమెకు రెండు రోజుల పాటు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. కాగా.. తనపై అన్యాయంగా పెట్టిన కేసు కొట్టేయాలని హైకోర్టులో స్క్వాష్ పిటిషన్‌ను ఎమ్మెల్యే ఆదిమూలం దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

News September 11, 2024

చిత్తూరు: రూ.2 లక్షలకు లడ్డూ దక్కించుకున్న ఎమ్మెల్యే

image

చిత్తూరు పట్టణంలోని బజారు వీధిలో బంగారం దుకాణాల వ్యాపారులు వినాయక చవితి సందర్భంగా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నిమజ్జనం సందర్భంగా స్వామివారి దగ్గర ఉంచిన లడ్డూకు వేలంపాట నిర్వహించారు. దీనిని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ రూ. 2 లక్షలకు పాడి దక్కించుకున్నారు. లడ్డూను భక్తులకు పంచిపెట్టారు. మాజీ కార్పొరేటర్ వసంత కుమార్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.