News March 23, 2025

చంద్రబాబు పర్యటనపై ఎమ్మెల్యే ఏలూరి వీడియో కాన్ఫరెన్స్

image

ఏప్రిల్ ఒకటిన సీఎం చంద్రబాబు పర్చూరు నియోజకవర్గంలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. పర్యటన ఏర్పాట్లపై పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆదివారం నియోజకవర్గంలోని అన్ని మండలాల అధ్యక్షులు, ముఖ్య నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను నాయకులకు వివరించారు. ఈ సందర్భంగా నాయకులకు పలు సూచనలు చేశారు.

Similar News

News April 25, 2025

SC గురుకులాల్లో ప్రవేశాలు.. నేటి నుంచి దరఖాస్తులు

image

TG: రాష్ట్రంలోని 239 ఎస్సీ గురుకులాల్లో ఇంటర్ ఫస్టియర్‌లో ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమవుతుంది. మే 15 వరకు అప్లై చేసుకోవచ్చు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, ఒకేషనల్ కోర్సుల్లో సీట్లు ఉంటాయి. టెన్త్ పరీక్షల్లో మెరిట్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్: https://tgswreis.cgg.gov.in/

News April 25, 2025

వడ్డీ రేట్లు తగ్గించిన మరో 2 బ్యాంకులు

image

ఇటీవల ఆర్బీఐ రెపో రేటును 0.25% తగ్గించడంతో ఆ మేర రుణ రేటును కుదించనున్నట్లు కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ ప్రకటించాయి. దీంతో కెనరా బ్యాంకులో హౌస్ లోన్ కనీస రేటు 7.90%, వాహన రుణ రేటు 8.20% నుంచి ప్రారంభమవుతాయి. ఇండియన్ బ్యాంక్ గృహ రుణ రేటు 7.90%, వెహికల్ లోన్ రేటు 8.25% నుంచి మొదలవుతాయి. ఈ నెల 12 నుంచే ఈ రేట్లు అమల్లోకి వచ్చాయి.

News April 25, 2025

గెస్ట్ లెక్చరర్ల సర్వీసు పొడిగింపు

image

AP: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్టు లెక్చరర్ల సర్వీసును ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. ఈ నెల 1 నుంచి వచ్చే ఏడాది మార్చి 18 వరకు సేవలను వినియోగించుకోనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో 957 మందికి లబ్ధి చేకూరనుంది. వేసవి సెలవుల అనంతరం వీరు క్లాస్‌లు తీసుకోనున్నారు.

error: Content is protected !!