News January 3, 2025
చంద్రబాబు పిలుపుతోనే టీడీపీలోకి: MP బీదమస్తాన్ రావు

రాజ్యసభ సభకు రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన బీద మస్తాన్ రావుకు నెల్లూరు జిల్లా యాదవ సంఘం, యాదవ ఎంప్లాయిస్ అఫీషియల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మానం నిర్వహించారు. గురువారం రాత్రి నెల్లూరులో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ఆత్మీయ ఆహ్వానం మేరకు టీడీపీలో చేరానన్నారు. వైసీపీ ఓడిపోవడంతో తాను రాజ్యసభకు రాజీనామా చేసి హుందాగా వ్యవహరించానని అన్నారు.
Similar News
News October 8, 2025
నెల్లూరు: దాహం తీర్చేవారేరి..!

దుత్తలూరు(M) నందిపాడు ఎస్సీ కాలనీ, వరికుంటపాడు(M) దక్కనూరు, వింజమూరు(M) కాటేపల్లి బీసీ కాలనీ, కొడవలూరు(M)గండవరంలో RO ప్లాంట్ల ఏర్పాట్లల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. వీటిల్లో రూ.29 లక్షలతో ప్లాంట్లను నెలకొల్పాలని తీర్మానించారు. వీకేపాడులో కేవలం భవనం కట్టి వదిలేయగా, మరికొన్ని చోట్ల పనులే ప్రారంభం కాలేదు. దీనిపై విమర్శలు వస్తున్నాయి. అధికారులు వీటిపై పునఃసమీక్షించాలని ప్రజలు కోరారు.
News October 8, 2025
నెల్లూరులో మర్డర్స్.. పోలీసుల అదుపులో నిందితులు?

నెల్లూరు రంగనాయకుల గుడి వెనుక వైపు ఉన్న వారధి వద్ద డబుల్ మర్డర్ జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు పురోగతి సాధించినట్లు సమాచారం. ఎస్పీ డా.అజిత వెజెండ్ల, DSP సింధూ ప్రియ పర్యవేక్షణలో సంతపేట CI దశరథ రామారావు విచారణ చేపట్టారు. హత్య చేసిన వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నేడే, రేపో నిందితుల వివరాలు బహిర్గతం చేస్తారని తెలుస్తోంది.
News October 8, 2025
నెల్లూరు: ‘మహిళలపై జరిగే నేరాల నివారణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి’

మహిళలపై జరిగే నేరాల నివారణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పోలీసులకు గుంటూరు రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠి ఆదేశించారు. మంగళవారం మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో DSP, ఆపై స్థాయి పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ప్రస్తుత పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలను ఆరా తీశారు. ప్రాపర్టీ, రౌడీ ఎలెమెంట్స్, గాంజా, మిస్సింగ్ కేసులు, పోక్సో వంటి కేసులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.