News June 10, 2024

చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవానికి 17 ఎల్ఈడీ స్క్రీన్‌లు

image

విజయవాడ సమీపంలోని గన్నవరం కేసరపల్లి ఐటీ పార్కు వద్ద ఈనెల 12న జరగనున్న చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని జిల్లా నుంచి ప్రజలు వీక్షించేందుకు 17 ప్రదేశాల్లో ఎల్ఈడీ స్క్రీన్‌లను ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఇన్‌చార్జి కలెక్టరు వికాస్‌ మర్మత్‌ పేర్కొన్నారు. సోమవారం ఉదయం సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై సమీక్షించారు.

Similar News

News November 15, 2025

చేజర్ల మండలంలో రోడ్డు ప్రమాదం

image

చేజర్ల మండలం ఏటూరు కండ్రిక వద్ద శుక్రవారం గేదెను బైకు ఢీకొట్టింది. నాగులవెల్లటూరు గ్రామానికి చెందిన ముప్పసాని బాబు పోస్టల్ శాఖలో పనిచేస్తున్నారు. పొదలకూరు నుంచి పని ముగించుకుని తన గ్రామానికి తిరిగి వస్తుండగా గేదెను ఢీకొనడంతో గాయపడ్డాడు. స్థానికులు 108 సాయంతో పొదలకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News November 15, 2025

Way2News కథనం.. మంత్రి ఆదేశాలతో పనులు

image

నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండు అండర్ బ్రిడ్జి, ఫ్లైఓవర్‌పైన జాయింట్ల వద్ద రూ.40లక్షలతో మరమ్మతులు చేపడుతున్నట్లు కమిషనర్ నందన్ తెలిపారు. ఈ పనులు 16వ తేదీ నుంచి సుమారుగా 45 రోజులపాటు జరుగుతాయన్నారు. మంత్రి నారాయణ ఆదేశించినట్లు కమిషనర్ తెలిపారు. ఈ సమస్యపై ఇటీవల “మంత్రి వర్యా.. ఇదీ మీ సమస్య కాదా” అన్న శీర్షికన Way2News కథనం ప్రచురించింది. స్పందించిన మంత్రి మరమ్మతులకు ఆదేశించారు.

News November 14, 2025

ప్రారంభం కానున్న జెండర్ రిసోర్సు సెంటర్

image

జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కోవూరు, గుడ్లూరు, వెంకటాచలం, పొదలకూరు, కావలి, కలిగిరి, ఆత్మకూరు, రాపూరు మండలాల్లో ఈ నెల 20లోగా జెండర్ రిసోర్సు సెంటర్లు ఏర్పాటు కానున్నాయి. మహిళా ప్రతినిధులే ఈ కేంద్రాలను నిర్వహిస్తారు. లైంగిక–వరకట్న వేధింపులు, బాల్య వివాహాలు, హింస వంటి సమస్యలపై కౌన్సెలింగ్, న్యాయం, తక్షణ సాయం అందిస్తారు. ఒక్కో కేంద్రానికి రూ.5 లక్షలు మంజూరు చేశారు.