News June 11, 2024
చంద్రబాబు ప్రమాణస్వీకారానికి పక్కా ఏర్పాట్లు: వికాస్ మర్మత్

సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు జిల్లాలో ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేసినట్లు ఇన్ఛార్జ్ కలెక్టర్ వికాస్ మర్మత్ తెలిపారు. మంగళవారం ఉదయం నెల్లూరు కార్పొరేషన్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఎటువంటి ఇబ్బందులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.
Similar News
News November 24, 2025
నెల్లూరు: మేయర్ పదవి కలిసిరాలేదేమో…

YCP హయాంలో NMC మేయర్గా పీఠం ఎక్కిన స్రవంతికి ఆ పదవి అచ్చోచ్చినట్లు లేదు. తమకెవరూ అడ్డురారనే ధీమాతో ఆనాడు మేయర్ భర్త జయవర్దన్ కార్పొరేషన్లో చక్రం తిప్పాడు. ఏకంగా కమిషనర్ సంతకాన్నే ఫోర్జరీ చేసి జైలు పాలయ్యాడు. తిరిగి కోటంరెడ్డి చెంతకు చేరేందుకు పావులు కదిపినా సఫళీకృతం కాలేదు. అక్కడ్నుంచి మేయర్ అటు YCP, ఇటు TDPల మధ్య రాజకీయ పావుగా మారిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు.
News November 24, 2025
Next నెల్లూరు మేయర్ ఎవరు..? జరుగుతున్న చర్చ ఇదే

మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానం నెగ్గితే తర్వాత మేయర్ ఎవరనేది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. స్రవంతి ST సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడంతో.. అదే సామాజిక వర్గానికి చెందిన వారికి ఇవ్వాలన్న అభిప్రాయం టీడీపీలో వ్యక్తమవుతోంది. అదే జరిగితే 53వ డివిజన్ కార్పొరేటర్ సుజాత, 5వ డివిజన్ కార్పొరేటర్ రవిచంద్రకు అవకాశం ఉంటుంది. లేదంటే డిప్యూటీ మేయర్కి ఇన్ఛార్జ్ మేయర్ బాధ్యతలు ఇచ్చే చాన్స్ కూడా ఉంది.
News November 24, 2025
నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు.. SP కీలక సూచన

రానున్న 4, 5 రోజుల్లో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. సోమశిల నుంచి నీటిని విడుదల చేయనున్న నేపథ్యంలో పెన్నా పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అజిత కోరారు. ఆదివారం 27,300 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారని తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే ప్రవాహాన్ని బట్టి సోమశిల నుంచి నీటిని విడుదల చేస్తారని అన్నారు. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు.


