News June 11, 2024

చంద్రబాబు ప్రమాణస్వీకారం.. 7 వేల మంది పోలీసులతో బందోబస్తు

image

సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి భారీగా ప్రముఖులు విజయవాడ చేరుకుంటున్నారు. కేసరిపల్లిలోని ఐటీటవర్ వద్ద బుధవారం ఉ.11.27 గంటలకు సీఎంగా చంద్రబాబు ప్రమాణం చేయనుండగా.. దాదాపు 7వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటుచేశారు. ప్రధానితో పాటు కీలక నేతలు, వీవీఐపీలు విచ్చేస్తుండటంతో వారు బసచేసే హోటల్స్ వద్ద ప్రత్యేక భద్రత ఏర్పాటుచేశారు. విజయవాడలో పలుచోట్ల ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టనున్నారు.

Similar News

News December 6, 2025

GNT: వైసీపీ బీసీ సెల్ ఉపాధ్యక్షుడిగా సిరిబోయిన

image

వైసీపీ బీసీ సెల్ గుంటూరు జిల్లా ఉపాధ్యక్షుడిగా సిరిబోయిన అవినాశ్ నియమితులయ్యారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం అదిష్ఠానం తనను ఉపాధ్యక్షుడిగా నియమించడం సంతోషంగా ఉందని అన్నారు. రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పార్టీ నగర అధ్యక్షురాలు నూరీఫాతీమా తనకు పదవి రావడానికి కృషి చేశారని హర్షం వ్యక్తం చేశారు. పార్టీ తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని స్పష్టం చేశారు.

News December 6, 2025

GNT: మంత్రి నారా లోకేశ్‌పై అంబటి ట్వీట్

image

మంత్రి నారా లోకేశ్‌పై గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు ‘X’లో సెటైరికల్ ట్వీట్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో విద్యార్థులతో కలిసి భోజనం చేసిన అనంతరం మంత్రి లోకేశ్ చంద్రబాబు ప్లేటును తీస్తున్న ఓ ఫొటో షేర్ చేసి, ఇప్పుడు నువ్వు “తిన్న ప్లేటు” రేపు నువ్వు “కూర్చున్న సీటు” తీసేయడం కాయం.! అంటూ క్యాప్షన్ ఇచ్చి చంద్రబాబు, లోకేశ్‌లకు ట్యాగ్ చేశారు.

News December 6, 2025

నేడు అంబేడ్కర్ వర్థంతి.. నారా లోకేశ్ ట్వీట్

image

రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ వర్థంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తున్నాను అంటూ మంత్రి నారా లోకేశ్ ‘X’ లో పోస్ట్ చేశారు. ‘దళితుల సాధికారత, పేద, బడుగు వర్గాల శ్రేయస్సు కోసం ఆయన జీవితాంతం కృషిచేశారు. స్వేచ్ఛ, సమానత్వం కోసం పరితపించారు. నవభారత నిర్మాణానికి బాటలు వేసిన దార్శనికుడు డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ఆశయ సాధన కోసం ప్రతిఒక్కరం కృషిచేద్దాం’ అంటూ రాసుకొచ్చారు.