News June 12, 2024

చంద్రబాబు ప్రమాణస్వీకారం.. 7 వేల మంది పోలీసులతో బందోబస్తు

image

సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి భారీగా ప్రముఖులు విజయవాడ చేరుకుంటున్నారు. కేసరిపల్లిలోని ఐటీటవర్ వద్ద బుధవారం ఉ.11.27 గంటలకు సీఎంగా చంద్రబాబు ప్రమాణం చేయనుండగా.. దాదాపు 7వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటుచేశారు. ప్రధానితో పాటు కీలక నేతలు, వీవీఐపీలు విచ్చేస్తుండటంతో వారు బసచేసే హోటల్స్ వద్ద ప్రత్యేక భద్రత ఏర్పాటుచేశారు. విజయవాడలో పలుచోట్ల ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టనున్నారు.

Similar News

News December 16, 2025

GNT: గంజాయి సేవిస్తున్న ఐదుగురు యువకులు అరెస్ట్

image

గుంటూరు తూర్పు నియోజకవర్గంలో గంజాయి మూలాలను కూకటివేళ్లతో పెకలించి వేస్తున్నామని DSP అబ్దుల్ అజీజ్ అన్నారు. పాతగుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతీనగర్ అబ్దుల్ బాబా మసీదు ఎదురు ఖాళీస్థలంలో ఐదుగురు యువకులు గంజాయి సేవిస్తుండగా పట్టుకున్నారు. పాతగుంటూరు పోలీసులు అరెస్ట్ చేయగా కేసు వివరాలను DSP వివరించారు. వారి వద్ద నుంచి 20గ్రాముల గంజాయి, 4 గ్రాముల లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.

News December 16, 2025

GNT: మృతదేహాల తరలింపులోనూ వసూళ్ల దందా.!

image

ఎంతో ఘన చరిత్ర ఉన్న గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మహాప్రస్థానం వాహనాల డ్రైవర్లు వసూళ్ల దందాకు పాల్పడుతున్నట్లు బాధితులు వాపోతున్నారు. మృతదేహాన్ని ఉచితంగా గమ్యస్థానానికి చేర్చాల్సిన మహాప్రస్థానం వాహన డ్రైవర్లు దూరాన్ని బట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రాణం కోల్పోయిన బాధలో ఉన్న కుటుంబాలను కూడా బ్లాక్‌ మెయిల్ చేస్తున్నారని, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని బాధితులు వాపోతున్నారు.

News December 16, 2025

పది పరీక్షల్లో జిల్లాను అగ్రగామిగా నిలపాలి: DEO

image

గుంటూరు జిల్లాను రానున్న 10వ తరగతి పరీక్షల్లో రాష్ట్రంలో అగ్రగామిగా నిలపాలని జిల్లా విద్యాశాఖ అధికారి సలీమ్ బాషా సూచించారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని PPD, SJR మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్స్‌ని మంగళవారం DEO పరిశీలించారు. 10వ తరగతి స్లిప్ టెస్ట్ పరీక్షా పత్రాలను పరీక్షించారు. ప్రతి పాఠశాలలో 100 రోజుల ప్రణాళికలు అమలవ్వాలని ఆదేశించారు. ఆయన వెంట మండల విద్యాశాఖాధికారి అబ్దుల్ ఖుద్దూస్ ఉన్నారు.