News June 12, 2024
చంద్రబాబు ప్రమాణస్వీకారం.. 7 వేల మంది పోలీసులతో బందోబస్తు

సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి భారీగా ప్రముఖులు విజయవాడ చేరుకుంటున్నారు. కేసరిపల్లిలోని ఐటీటవర్ వద్ద బుధవారం ఉ.11.27 గంటలకు సీఎంగా చంద్రబాబు ప్రమాణం చేయనుండగా.. దాదాపు 7వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటుచేశారు. ప్రధానితో పాటు కీలక నేతలు, వీవీఐపీలు విచ్చేస్తుండటంతో వారు బసచేసే హోటల్స్ వద్ద ప్రత్యేక భద్రత ఏర్పాటుచేశారు. విజయవాడలో పలుచోట్ల ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టనున్నారు.
Similar News
News March 20, 2025
గుంటూరు: పోలీస్ స్టేషన్‌కు చేరిన ప్రేమ వ్యవహారం

పొన్నెకళ్లుకు చెందిన నాగమల్లేశ్వరరావు(24) అదే గ్రామానికి చెందిన ఓ యువతి ప్రేమించుకున్నారు. ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకోవాలని ఇంట్లో నుంచి వచ్చేసి అరండల్ పేటలోని లాడ్జిలో ఉన్నారు. సమాచారం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని తనను కొట్టి యువతిని తీసుకెళ్లారని నాగమల్లేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అరండల్ పేట సీఐ వీరస్వామి తెలిపారు.
News March 20, 2025
GNT: బంగారం చోరీ.. పట్టించిన తండ్రి

జల్సాలకు అలవాటు పడి చోరీలు చేస్తున్న యువకుడిని అతని తండ్రే పట్టాభిపురం పోలీసులకు అప్పగించాడు. కాకినాడకు చెందిన యువకుడు గుంటూరు విద్యానగర్‌లోని ఓ వ్యాపారి ఇంట్లో ఈ నెల 7న రూ. కోటి విలువ చేసే బంగారాన్ని చోరీచేశాడు. పోలీసులు విచారణ వేగవంతం చేయడంతో భయపడి చోరీ బంగారాన్ని పార్సిల్ ద్వారా పంపించాడు. ఆ తర్వాత తండ్రి ఆ నిందితుణ్ణి స్టేషన్‌లో అప్పగించినట్లు తెలుస్తోంది.
News March 20, 2025
వట్టిచెరుకూరు: అత్యాచార ఘటనలో వృద్దుడి మృతి

ఏడేళ్ల బాలికపై అత్యాచార ఘటనలో బాలిక బంధువుల దాడిలో గాయపడి గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వృద్దుడు మృతి చెందాడు. వట్టిచెరుకూరు సీఐ రామానాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. వట్టిచెరుకూరు మండలంలో 2వ తరగతి చదువుతున్న బాలికపై థామస్ (60)అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాలిక బంధువులు థామస్‌పై దాడి చేయడంతో చికిత్స పొందుతూ మరణించాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.