News June 11, 2024
‘చంద్రబాబు ప్రమాణ స్వీకారం విజయవంతం చేయాలి’

ఈ నెల 12న గన్నవరం మండలం కేసరపల్లిలో సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే వీవీఐపీ, వీఐపీ అతిథులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
Similar News
News February 23, 2026
కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

కృష్ణా : ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ పరీక్షలు
28న గన్నవరంలో జాబ్ మేళా
పెనమలూరు: ఇంటర్ విద్యార్థి మృతి
కనకదుర్గ వారధి నుంచి గంగూరుకు ఎలివేటెడ్ ఫ్లైఓవర్
పామర్రు : క్షణకావేశంలో తండ్రిని హతమార్చిన కొడుకు
విజయవాడలో రేపు ప్రజాప్రతినిధులకు క్రీడా పోటీలు
NTR : లంచం అడిగితే ఈ నెంబర్ కి ఫోన్ చేయండి.!
News February 23, 2026
కృష్ణా: 14 కి.మీ ఎలివేటెడ్ ఫ్లై ఓవర్‌కు ప్రణాళికలు

విజయవాడలో కనకదుర్గ ఫ్లైఓవర్ నుంచి గంగూరు వరకు 14KM ఎలివేటెడ్ మెగా ఫ్లైఓవర్ కారిడార్ నిర్మాణానికి NH అధికారులు సానుకూలంగా స్పందించారు. బందరు రోడ్డునుంచి వచ్చే వాహనాలు ట్రాఫిక్ ఆటంకం లేకుండా అమరావతి వైపు ప్రయాణించేందుకు ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రోడ్డు విస్తరణ లేకుండానే 6 వరుసల ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టనున్నారు. గంగూరు- దావులూరు ORR వరకు హైవేను 6 లైన్లుగా విస్తరిస్తారు.
News February 23, 2026
కృష్ణా: అపరాల కోతలకు కూలీల కొరత

జిల్లాలో రెండో పంటగా సాగుచేసిన అపరాల పంట కోతల దశకు చేరుకోవడంతో రైతులకు కూలీల కొరత తీవ్రంగా ఎదురవుతోంది. స్థానికంగా వ్యవసాయ కూలీలు అందుబాటులో లేకపోవడంతో రైతులు ఇతర ప్రాంతాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం, ఒడిశా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి కూలీలు పెద్ద సంఖ్యలో జిల్లాకు తరలివస్తున్నారు. ప్రస్తుతం అపరాల పంట కోతలు వేగంగా సాగుతున్న నేపథ్యంలో కూలీలకు డిమాండ్ ఏర్పడింది.


