News June 12, 2024

చంద్రబాబు ప్రమాణ స్వీకార వేదికపై 36 మంది

image

చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న సభా వేదికపై 36 మంది ప్రముఖులు కూర్చోనున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్, అమిత్ షా, జేపీ నడ్డా, జితిన్ రామ్ మాఝి, చిరాగ్ పాశ్వాన్, నితిన్ గడ్కరి, కిషన్ రెడ్డి, కె.రామ్మోహన్, వెంకయ్యనాయుడు, మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై.. చిరంజీవి, రజినీకాంత్, నారా లోకేశ్, నాదెండ్ల మనోహర్ తదితరులు ఆశీనులు కానున్నారు.

Similar News

News November 19, 2025

GNT: తెలుగు సాహితీవేత్త మద్దిపట్ల సూరి సేవలు అజరామరం

image

సాహిత్య విమర్శకుడు మద్దిపట్ల సూరి తెలుగు సాహిత్య, సాంస్కృతిక రంగంలో సుపరిచితుడు. 1916, జులై 7న తెనాలి సమీపంలో ఆయన జన్మించారు. తెలుగు అకాడమీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరుగా కీలక సేవలు అందించారు. అకాడమీ ద్వారా తెలుగులో విజ్ఞాన, శాస్త్ర సంబంధిత గ్రంథాల ప్రచురణకు ఆయన విశేష కృషి చేశారు. సూరి తెలుగు భాషాభివృద్ధికి, విద్యా సంబంధిత పుస్తకాల విస్తరణకు తమ జీవితాన్ని అంకితం చేశారు. 1995 నవంబర్ 19న మరణించారు.

News November 19, 2025

గుంటూరు జిల్లా రైతుల ఖాతాల్లో ఎంత పడతాయంటే ?

image

అన్నదాత సుఖీభవ -పీఎం కిసాన్ కింద రైతుల ఖాతాల్లో ప్రభుత్వం బుధవారం నిధులు జమ చేయనుంది. గుంటూరు జిల్లాలో 1,06,329 మంది రైతుల ఖాతాల్లో రూ.70 కోట్లు జమ కానున్నాయి. అన్నదాత సుఖీభవ కింద రూ.53.16 కోట్లు, అదేవిధంగా పీఎం కిసాన్ కింద రూ.16.84 కోట్లు జమ అవుతాయని అధికారులు తెలిపారు. జిల్లా స్థాయి కార్యక్రమం లామ్ ఫామ్ ఆడిటోరియంలో బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట నుండి జరగనుంది. మంత్రి కందుల దుర్గేశ్ పాల్గొంటారు.

News November 19, 2025

గుంటూరు: యువతిని వేధించిన కేసులో నిందితుడికి జైలు శిక్ష

image

ప్రేమ పేరుతో యువతిని వెంబడించి వేధించిన కేసులో నిందితుడు పాత గుంటూరు సయ్యద్ జుబేర్ అహ్మద్‌కు మొదటి AJCJ కోర్టు 7 నెలల జైలు శిక్షతో పాటు రూ.3,000 జరిమానా విధించింది. 2019లో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసి, పోలీసులు సాక్ష్యాలతో కోర్టుకు సమర్పించగా తీర్పు వెలువడింది. ఇలాంటి మహిళలపై దాడులు, వేధింపులను కఠినంగా ఎదుర్కొంటామని గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు.