News August 6, 2024
చంద్రబాబు సభా ప్రాంగణాన్ని పరిశీలించిన MLA

ఈనెల 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు చీరాలకు రానున్న సందర్భంగా.. ఆ సభా ప్రాంగణాలను ఏమ్మెల్యే కొండయ్య సోమవారం రాత్రి పరిశీలించారు. వేటపాలెం మండలంలోని చేనేతపురి కాలనీలో సభా ఏర్పాట్లకు అనువైన ప్రదేశాలను, జాండ్రపేట బీవీఆర్ హైస్కూల్ ప్రాంగణాన్ని పరిశీలించారు. స్థలం ఎంపికపై అధికారులతో చర్చించారు. అధికారులు అందరూ సీఎం చంద్రబాబు పర్యటన విజయవంతం అయ్యేవిధంగా కృషి చేయాలని MLA సూచించారు.
Similar News
News December 16, 2025
ప్రగతి నివేదికలు సిద్ధం చేయాలి: ప్రకాశం కలెక్టర్

ఈనెల 17,18 తేదీల్లో జరగనున్న కలెక్టర్ల సమీక్షా సమావేశానికి అవసరమైన ప్రగతి నివేదికలను సిద్ధంచేయాలని జిల్లా కలెక్టర్ రాజబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం ఒంగోలు కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ల సమావేశానికి అవసరమైన నివేదికలగురించి జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో వెలిగొండ ప్రాజెక్ట్ పనుల పురోగతి పూర్తిగా నివేదిక రూపంలో ఇవ్వాలన్నారు.
News December 16, 2025
సమస్యలు నిర్ణీత గడువులోగా పరిష్కరించాలి: ప్రకాశం కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం కలెక్టర్ మీకోసం కార్యక్రమం అనంతరం జిల్లాస్థాయి అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సమస్యలతో వచ్చే ప్రజలతో అధికారులు మర్యాదపూర్వకంగా మెలగాలన్నారు. అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.