News November 11, 2024
చంద్రశేఖరన్‌తో మంత్రి టీజీ భరత్ సెల్ఫీ

టాటా సన్స్ గ్రూప్స్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌ను మంత్రి టీజీ భరత్ కలిశారు. కారులో ఆయనతో సెల్ఫీ తీసుకున్నారు. విలువైన వ్యక్తిని కలవడం స్ఫూర్తిదాయకంగా భావిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఆయన పంచుకునే జ్ఞానం తనను నిరంతరం ఆకట్టుకుంటోందని కొనియాడారు. వ్యక్తిగత, వృత్తిపరమైన ఎదుగుదలకు కట్టుబడి ఉన్న వ్యక్తిని కలుసుకోవడం సంతోషంగా ఉందంటూ ఆయన ట్వీట్ చేశారు.
Similar News
News November 7, 2025
ఈనెల 12న RUకు గవర్నర్ అబ్దుల్ నజీర్ రాక: వీసీ

ఈ నెల 12న రాయలసీమ యూనివర్సిటీలో నిర్వహిస్తున్న 4వ కాన్వకేషన్‌కు గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరవుతున్నట్లు వైస్ ఛాన్స్లర్ వెంకట బసవరావు వెల్లడించారు. శుక్రవారం యూనివర్సిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. యూనివర్సిటీలో 75 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, 283 మంది స్కాలర్లకు కాన్వకేషన్ పట్టాలు, 18,396 మందికి ఓడీ ప్రదానం చేయనున్నారని పేర్కొన్నారు.
News November 7, 2025
‘మన మిత్ర’ సేవలు ప్రతి ఇంటికి: కలెక్టర్ సిరి

కర్నూలు జిల్లాలోని వంద శాతం కుటుంబాలు వాట్సాప్ గవర్నెన్స్ సేవలను వినియోగించుకునేలా నేటి నుంచి ప్రతి శుక్రవారం ఇంటింటి ప్రచారం ప్రారంభించాలని కలెక్టర్ డా.ఏ.సిరి సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ప్రతి ఇంటికి వెళ్లి సేవలపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి కుటుంబం ‘మన మిత్ర’ యాప్ ద్వారా సేవలను వినియోగించుకునేలా మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, జడ్పీ సీఈవోలు, డీఎల్డీవోలు పర్యవేక్షించాలని సూచించారు.
News November 7, 2025
జాతీయ స్థాయి క్రికెట్‌కు మద్దికేర విద్యార్థి ఎంపిక

మద్దికేరకు చెందిన కాలువ శ్రీరాములు, లక్ష్మీ కుమారుడు యువరాజు ఫాస్ట్ బౌలర్‌గా జాతీయ స్థాయి క్రికెట్‌కు ఎంపికయ్యాడు. ఈ మేరకు ఆయన తల్లిదండ్రులు గురువారం తెలిపారు. ఇటీవల శ్రీకాకుళంలో జరిగిన రాష్ట్రస్థాయి అండర్-19 విభాగంలో మంచి ప్రదర్శన చూపడంతో జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. యువరాజ్ ఇంటర్ చదువుతున్నాడు. కరస్పాండెంట్ యజ్ఞం మాధవ్, ప్రిన్సిపల్ సునీత, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.


