News March 27, 2025
చట్టం దృష్టి నుండి తప్పించుకోలేరు: ఆదిలాబాద్ SP

ప్రతిరోజు నేరం చేసే వారికి ఖచ్చితంగా శిక్ష పడుతుందనే నమ్మకం న్యాయస్థానం ద్వారా లభిస్తుందని ADB SP అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. చట్టం దృష్టిలో ప్రతి ఒక్కరు సమానమేనని, తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చట్టం దృష్టి నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు. 2022లో హత్య కేసులో ఒకరికి యావజీవ శిక్ష పడిందన్నారు. నేరస్తుడికి శిక్ష పడటంలో ప్రతిభ కనబరిచిన కోర్టు డ్యూటీ అధికారి, లైజన్ అధికారి, పీపీని అభినందించారు.
Similar News
News November 18, 2025
ఆదిలాబాద్లో రేపటి నుంచి పత్తి కొనుగోళ్లు

బుధవారం నుంచి పత్తి కొనుగోళ్లు చేపట్టనున్నట్లు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. రాష్ట్ర జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ తలపెట్టిన బంద్ను విరమించుకున్న నేపథ్యంలో ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో సీసీఐ, ప్రైవేటు ద్వారా పత్తి కొనుగోళ్లు యథావిధిగా చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని రైతు సోదరులు గమనించాలని సూచించారు.
News November 18, 2025
ADB: ఈ నెల 20న వయోవృద్ధుల దినోత్సవ వేడుకలు

అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో ఈ నెల 20న వేడుకలను నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి మిల్కా పేర్కొన్నారు. ఈ వేడుకల్లో జిల్లాలోని వయోవృద్ధులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. డీఎంహెచ్ఓ, రిమ్స్ వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో ఉదయం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
News November 18, 2025
ADB: ఉపకార వేతనం మంజూరుకై దరఖాస్తుల ఆహ్వానం

2025–26 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10 తరగతులు చదువుతున్న బీసీ విద్యార్థులు ఉపకార వేతనం కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆదిలాబాద్ జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి రాజలింగు తెలిపారు. అర్హులైన విద్యార్థులు http://telanganaepass.cgg.gov.in వెబ్సైట్ ద్వారా డిసెంబర్ 15 లోపు దరఖాస్తులు సమర్పించాలని కోరారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


