News May 20, 2024

చట్టపరంగా ఎటువంటి తప్పు చేయలేదు: విష్ణుకుమార్ రాజు

image

చట్టపరంగా, న్యాయపరంగా తాను ఎటువంటి తప్పు చేయలేదని విశాఖ నార్త్ BJP MLA అభ్యర్థి <<13279687>>విష్ణుకుమార్ రాజు<<>> అన్నారు. నగరంలోని బర్మా కాలనీలో రెండు కుటుంబాల మధ్య దాడికి సంబంధించి కేసును తప్పుదోవ పట్టించారని పోలీసులు ఆయనకు 41-ఏ నోటీసులు అందజేశారు. దీనిపై ఆయన పోలీస్ స్టేషన్‌కు వెళ్లి స్టేషన్ బెయిలు తెచ్చుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటనపై మరోసారి విచారణ జరిపించాలని కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు.

Similar News

News October 15, 2025

పెందుర్తిలో 6.8కేజీల గంజాయి పట్టివేత

image

విశాఖ ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది మంగళవారం నిర్వహించిన పెట్రోలింగ్‌లో పెందుర్తి రైల్వే స్టేషన్ వెలుపల అనుమానితులను తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో ప్రకాశం జిల్లాకు చెందిన కువ్వరపు వినీల్ కుమార్, షేక్ సలీం అనే ఇద్దరు వ్యక్తులు రూ.40వేలు విలువ గల 6.8 కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ముద్దాయిలను పెందుర్తి ఎక్సైజ్ స్టేషన్‌కు తరలించారు.

News October 14, 2025

విశాఖ: బంపర్ డ్రా.. లింక్ క్లిక్ చేస్తే..!

image

ఆన్‌లైన్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విశాఖ సిటీ పోలీసులు సూచించారు. లాటరీ, బంపర్ డ్రాలు గెలుచుకున్నారంటూ సైబర్ నేరగాళ్లు ఆశ చూపిస్తారని, అది నమ్మి లింక్‌ క్లిక్ చేస్తే బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు కోల్పోతారని చెప్పారు. అటువంటి మెసెజ్‌లకు స్పందించవద్దని కోరారు. ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే టోల్‌ఫ్రీ నంబర్ 1930కి ఫిర్యాదు చేయాలన్నారు.

News October 14, 2025

విశాఖ: ముగ్గురు మోసగాళ్లు అరెస్ట్

image

ముగ్గురు సైబర్ నేరగాళ్లను విశాఖ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. కూర్మన్నపాలేనికి చెందిన వ్యక్తికి టెలిగ్రామ్ నుంచి పార్ట్‌టైమ్ జాబ్ పేరిట మెసెజ్ చేశారు. వివిధ కంపెనీల పేరిట రూ.15.51 లక్షలు కాజేశారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేశాడు. టెలిగ్రామ్ గ్రూపు IP లాగ్స్ ద్వారా నంద్యాలకి చెందిన షేక్ షరీఫ్ రెహమాన్, అబ్ధుల్ రెహమాన్, హుస్సేన్ వలిని పట్టుకున్నారు.