News March 20, 2025
చట్టవ్యతిరేక కార్యకలపాలపై ముందస్తూ సమాచారం సేకరించాలి: సీపీ

చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ముందస్తూ సమాచారాన్ని సేకరించడం స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది ప్రధాన కర్తవ్యమని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలియజేశారు. గురువారం వరంగల్ కమిషనరేట్ స్పెషల్ బ్రాంచ్ విభాగానికి చెందిన అధికారులు, సిబ్బంది పోలీస్ కమిషనర్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో సమీక్ష నిర్వహించారు.
Similar News
News November 24, 2025
సోకిలేరులో వాగులో యువకుడు గల్లంతు

చింతూరు మండలం తులసి పాక గ్రామ సమీప ఉన్న సోకిలేరు వాగులో స్నానం చేస్తూ పర్యాటకుడు ఆదివారం మృతి చెందాడు.15 మంది మిత్రులతో మోతుగూడెం విహారయాత్రకు వచ్చిన సురేష్ (28) సోకులేరు వాగులో స్నానానికి దిగి ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. మృతుడు విజయవాడకు చెందినట్లు ఎస్సై సాధిక్ తెలిపారు. కేసు నమోదు చేశారు.
News November 24, 2025
నేడు కొడంగల్కు సీఎం రేవంత్ రెడ్డి

TG: సొంత నియోజకవర్గం కొడంగల్లో CM రేవంత్ ఇవాళ పర్యటించనున్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు అక్షయపాత్ర ఫౌండేషన్ నిర్మించనునున్న గ్రీన్ ఫీల్డ్ కిచెన్కు ఆయన శంకుస్థాపన చేస్తారు. ఇప్పటికే కొడంగల్ నియోజకవర్గంలోని 316 సర్కార్ స్కూళ్లలో హరే కృష్ణ మూవ్మెంట్ సంస్థ బ్రేక్ఫాస్ట్ అందిస్తోంది. అది సక్సెస్ కావడంతో ఇదే తరహాలో మధ్యాహ్న భోజనం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
News November 24, 2025
వ్యవసాయంలో ఏటా 15% వృద్ధే లక్ష్యం: సీఎం

AP: ఇవాళ్టి నుంచి రైతన్నా.. మీకోసం కార్యక్రమం సందర్భంగా సీఎం చంద్రబాబు అన్నదాతలకు లేఖ రాశారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఏటా 15% వృద్ధి రేటే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. మారుతున్న ఆహారపు అలవాట్లకు అనుగుణంగా చిరుధాన్యాల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ‘రైతుల కోసం అన్నదాత సుఖీభవ, కిసాన్ డ్రోన్ సేవలు, బిందు సేద్యానికి సబ్సిడీతో పరికరాలు అందిస్తున్నాం’ అని పేర్కొన్నారు.


