News November 8, 2024
చట్ట పరిధిలోని ఫిర్యాదులను పరిష్కరిస్తాం: ఎస్పీ

పలాస కాశీబుగ్గ డివిజనల్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం బాధితుల నుంచి ఎస్పీ మహేశ్వరరెడ్డి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చట్ట పరిధిలోని ఫిర్యాదులను పరిష్కరిస్తామని అర్జీదారులకు భరోసా ఇచ్చారు. అనంతరం ఫిర్యాదులను సంబంధిత అధికారులకు ఎండార్స్ చేసి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు.
Similar News
News September 16, 2025
సిక్కోలు జిల్లాలో డీఎస్సీకి ఎంతమంది ఎంపికయ్యారంటే ?

శ్రీకాకుళం జిల్లాలో డీఎస్సీ-2025లో ఎంపికైన జాబితాను తాజాగా విద్యాశాఖ వెల్లడించింది. జిల్లాలో 543 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహించగా 535 మంది ఎంపికయ్యారు. ఇందులో ఎస్ఏ-391, ఎస్జీటీ-144 మంది ఎంపికయ్యారని అధికారులు వెల్లడించారు. ఎంపికైన వారికి ఈనెల 19న విజయవాడలో సీఎం చంద్రబాబు నాయుడు చేతులు మీదుగా నియామకపత్రాలు అందించనున్నారు.
News September 16, 2025
శ్రీకాకుళం ఎస్పీ గ్రీవెన్స్‌కు 55 అర్జీలు

పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలు పునరావృతమవకుండా పూర్తి స్థాయిలో విచారణ చేసి శాశ్వత పరిష్కారం చూపాలని పోలీసు అధికారులను ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి ఆదేశించారు. సోమవారం జిల్లా SP కార్యాలయంలో ఎస్పీ గ్రీవెన్స్ నిర్వహించారు. అర్జీల్లో పౌర సంబంధాలు, కుటుంబ, ఆస్తి గొడవలు, మోసపూరితమైనవి ఇతరత్రా అంశాలపై మొత్తం 55 ఫిర్యాదులు వచ్చాయని ఎస్పీ వెల్లడించారు.
News September 16, 2025
శ్రీకాకుళం జిల్లాలో టుడే టాప్ న్యూస్ ఇవే..!

➤పలాస: సమస్యల పరిష్కారానికి రోడ్డెక్కిన ఉపాధ్యాయులు.
➤మందస: బలవంతపు భూ సేకరణ ఆపాలి
➤సీఎం సమీక్ష సమావేశంలో సిక్కోలు మంత్రి, కలెక్టర్
➤టెక్కలి: మెరుగైన సేవలకు మరో భవనం కట్టాల్సిందే
➤బూర్జ: పాఠశాలకు తాళం వేసి విద్యార్థులు, తల్లిదండ్రులు నిరసన
➤ఎల్.ఎన్ పేట: నిలిచిన నిర్మాణం.. రాకపోకలకు అంతరాయం
➤రాజమండ్రిలో రైలెక్కిన బాలుడిని పలాసలో రక్షించిన పోలీసులు