News October 21, 2024

చట్ట పరిధిలో సమస్యలను పరిష్కరించండి: ఎస్పీ తుహిన్ సిన్హా

image

అనకాపల్లి జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన తుహిన్ సిన్హా సోమవారం ఎస్పీ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. 32 మంది ఆర్జీలు ఎస్పీకి అందజేశారు. ఎస్పీ సంబంధిత అధికారులతో మాట్లాడుతూ.. సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించాలని సూచించారు. వేగవంతంగా సమస్యలను పరిష్కరించేందుకు పోలీసు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేయాలన్నారు.

Similar News

News December 22, 2025

పోరాటానికి సిద్ధమైన విశాఖ ఉక్కు భూ నిర్వాసితులు

image

విశాఖ ఉక్కు భూ నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం జనవరి 4న పాత గాజువాకలో భారీ భిక్షాటన కార్యక్రమం చేపట్టనున్నారు. సుమారు 8,500 మంది ఆర్-కార్డు దారులకు న్యాయం చేయాలని, మిగులు భూములను పంపిణీ చేయాలని నిర్వాసితుల జేఏసీ డిమాండ్ చేస్తోంది. భూమి ఇచ్చే వరకు నెలకు రూ.25,000 భృతి చెల్లించాలని కోరుతూ 64 గ్రామాల నిర్వాసితులు ఈ పోరాటంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

News December 22, 2025

విశాఖ జిల్లా ప్రజలకు గుడ్ న్యూస్

image

విశాఖ జిల్లా ప్రజలు ఇకపై భవనాలు, ఖాళీ స్థలాల సర్వే సర్టిఫికెట్ల కోసం జీవీఎంసీ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. కమిషనర్ వినూత్న ఆలోచనతో రూపొందించిన ఆన్‌లైన్ విధానాన్ని మేయర్ పీలా శ్రీనివాసరావు, కమిషనర్ కేతన్ గార్గ్ సోమవారం ప్రారంభించారు. ​www.gvmc.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకుంటే వారం రోజుల్లోనే సర్టిఫికెట్ జారీ అవుతుంది.

News December 22, 2025

మా ఉద్యోగాలు అడ్డుకోవద్దు జగన్: విశాఖలో నిరుద్యోగుల ఆందోళన

image

జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద యువజన, నిరుద్యోగ సంఘాలు ఇవాళ ధర్నా చేపట్టాయి. టీసీఎస్, గూగుల్ వంటి ఐటీ సంస్థలపై వైసీపీ నేతలు కోర్టుల్లో కేసులు వేస్తూ అడ్డుకుంటున్నారని నేతలు మండిపడ్డారు. ‘మా జాబ్స్ అడ్డుకోవద్దు జగన్’ అంటూ నినాదాలు చేశారు. నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆడుకుంటే సహించబోమని తలసముద్రం సూర్యం, గిరిధర్ తదితర నేతలు హెచ్చరించారు.