News January 12, 2025

చట్ట వ్యతిరేక కార్యకలాపాల జోలికి వెళ్లకండి: ఎస్పీ

image

సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని చట్ట వ్యతిరేక వ్యతిరేక కార్యక్రలాపాల జోలికి వెళ్లకుండా ఉండాలని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ సూచించారు. పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. భోగి మకర సంక్రాంతి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని, ఎలాంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడరాదని జిల్లా ప్రజానీకానికి సూచించారు.

Similar News

News February 17, 2025

104ఏళ్ల బండయ్య మాస్టారుకు సన్మానం

image

కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలానికి చెందిన 104ఏళ్ల బండయ్య మాస్టారుకు స్థానిక పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు మల్లికార్జున మాట్లాడుతూ.. బ్రిటిష్ కాలంలోనే ఉపాధ్యాయుడిగా పనిచేసిన బండయ్య 104ఏళ్ల వయసులోనూ ఆరోగ్యంగా ఉండటం గొప్ప విషయమని అన్నారు. అనంతరం సబ్ ట్రెజరీ కార్యాలయంలో సర్టిఫికేట్ ప్రదానం చేశారు.

News February 17, 2025

ప్రతి సమస్యను పరిష్కరిస్తాం: కలెక్టర్

image

ఏ ఒక్క అర్జీదారుడు నిర్లక్ష్యానికి గురికాకుండా, ప్రతి సమస్యను పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ప్రజలకు తెలిపారు. రాయదుర్గం పట్టణంలోని బళ్లారి రోడ్ శ్రీ సీతారామాంజనేయ కళ్యాణ మండపంలో సోమవారం నిర్వహించిన PHRS కార్యక్రమంలో ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు.

News February 17, 2025

పెద్దవడుగూరు: దేవుడా.. పిల్లాడిపై దయ చూపలేకపోయావా..!

image

ఆ కుటుంబమంతా సంతోషంగా గడిపి కొద్ది క్షణాలలో ఇంటికి చేరుకుంటాం అనుకున్న సమయంలో మృత్యువు చిన్నారి రిత్విక్‌(3)ను కబళించింది. దిమ్మగుడి గ్రామానికి చెందిన సురేంద్ర రెడ్డి భార్య, కుమారులతో కలిసి పెద్దపప్పూరు అశ్వర్థం బ్రహ్మోత్సవాలకు వెళ్లి వస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో చిన్నారి రిత్విక్‌ మృతి చెందాడు. దేవుడా పిల్లవాడి మీద అయినా దయ చూపలేకపోయావా అంటూ కుటుంబసభ్యులు విలపిస్తున్నారు.

error: Content is protected !!