News September 24, 2024
చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి: శ్రీనివాస్ రెడ్డి
విద్యార్థులు చదువుతోపాటు క్రీడలపై ఆసక్తిని పెంచుకోవాలని సిద్దిపేట జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం నంగునూరు మండలంలోని నర్మెట ఉన్నత పాఠశాలలో మండల స్థాయి వాలీబాల్ క్రీడా పోటీలను డీఈవో ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్రీడలు ఆడడం వల్ల దృఢంగా ఉండటమే కాక మానసికంగా ఎంతో పరిణితి చెందుతారని తెలిపారు.
Similar News
News October 5, 2024
సంగారెడ్డి: పండుగ దృష్ట్యా 542 ప్రత్యేక బస్సులు
దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఉమ్మడి మెదక్ రీజియన్ పరిధిలో 542 ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపేందుకు సమాయత్తమైంది. సంగారెడ్డి రీజియన్ పరిధిలోని 8 డిపోల నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు సంగారెడ్డి ఆర్ఎం ప్రభులత తెలిపారు.ఆర్టీసీ చెందిన 334 సర్వీసులు, హైర్ బస్సులు 208 నడుపుతున్నామన్నారు. రద్దీ ఉంటే మరిన్ని నడుపుతామన్నారు.
News October 5, 2024
సంగారెడ్డి: రేపటి నుంచి జూనియర్ కళాశాలలకు సెలవులు
ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలలకు జిల్లా 6 నుంచి 13 తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించినట్లు జిల్లా ఇంటర్ అధికారి గోవిందారం శనివారం ప్రకటనలో తెలిపారు. దసరా సెలవుల్లో ఏవరైనా తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈనెల 14వ తేదీన తిరిగి కళాశాలలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. అన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
News October 5, 2024
బెజ్జంకి: యువకుడిపై హత్యాయత్నం
ఓ యువకుడిపై ఏడుగురు హత్యాయత్నం పాల్పడ్డారు. SI కృష్ణారెడ్డి వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా బెజ్జంకికి చెందిన ప్రవీణ్ కోరుట్లలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. బెజ్జంకికి చెందిన ముగ్గురితో డబ్బుల విషయంలో గొడవ జరుగుతోంది. దీంతో వారు ఈనెల 3న మరో నలుగురితో కలిసి HYDకి వెళ్తున్న ప్రవీణ్ కారుని అడ్డుకొని.. కత్తితో దాడి చేశారు. ప్రవీణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు తెలిపారు.