News February 16, 2026
చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి: సూర్యాపేట కలెక్టర్

విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరచాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. సోమవారం స్థానిక జూనియర్ కాలేజ్ మైదానంలో నిర్వహించిన జిల్లా స్థాయి సీఎం కప్ పోటీల విజేతలకు ఆయన బహుమతులు అందజేశారు. ఈనెల 20 నుంచి హైదరాబాద్‌లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో సూర్యాపేట విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.
Similar News
News March 17, 2026
NGKL: విశ్వహిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షుడి మృతి

వెల్దండ మండలం రాఘాయిపల్లి గేట్ సమీపంలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో విశ్వహిందూ పరిషత్ నాగర్‌కర్నూల్ జిల్లా ఉపాధ్యక్షుడు గిరిధర్ రెడ్డి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. కల్వకుర్తి మండలంలోని మార్చాల గ్రామానికి చెందిన ఆయన కల్వకుర్తిలో నివాసం ఉంటున్నారు. కారు బొలెరో ఢీకొన్న సంఘటనలో ఈ ప్రమాదం జరిగి అక్కడికక్కడే మృతి చెందినట్లు పేర్కొన్నారు.
News March 17, 2026
30 రోజులు రేణిగుంట రైల్వే బ్రిడ్జ్ క్లోజ్

రేణిగుంట రైల్వే అండర్ బ్రిడ్జ్‌ను మార్చి 23వ తేదీ నుంచి ఏప్రిల్ 22వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు ఆర్డీవో భాను ప్రకాశ్ రెడ్డి ప్రకటించారు. దాదాపు 50ఏళ్ల కాలం నాటి బ్రిడ్జ్ కావడంతో మరమ్మతులు అవసరమని రైల్వే శాఖ నిర్ణయించిందన్నారు. కరకంబాడి రోడ్, కొత్త బైపాస్, సంత మార్కెట్ రోడ్డు మార్గాల్లో వాహనాలు వెళ్లాలని ఆయన సూచించారు. ఈ మార్గంలో కడప వాహనదారులు అధికంగా వెళ్తుంటారు కాబట్టి గమనించాలన్నారు.
News March 17, 2026
విశాఖ: సరెండర్ తర్వాత భవానీ శంకర్‌కు పోస్టింగ్

విశాఖలో DROగా పనిచేసి సరెండర్ అయిన భవానీ శంకర్‌కు ఎట్టకేలకు ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. గతేడాది RDO శ్రీలేఖతో విభేదాల కారణంగా ఇద్దరినీ సరెండర్ చేశారు. అప్పటి నుంచి పోస్టింగ్ లేకుండా ఉన్న ఆయనను కాకినాడ జిల్లా పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


