News August 22, 2024
చదువులో వెనుకబడిన వారిపై శ్రద్ధ చూపండి: DEO
బూసిగూడెం గిరిజన సంక్షేమ పాఠశాలను ఏజెన్సీ DEO మల్లేశ్వరావు గురువారం తనిఖీ చేశారు. విద్యార్థుల పఠనాశక్తిని పరిశీలించారు. 20 శాతం విద్యార్థులు చదువులో వెనుకబడి ఉన్నారని, వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని టీచర్లను ఆదేశించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారం ఇవ్వాలని, పాఠశాల పరిసరాలను శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.
Similar News
News September 19, 2024
సాగర్ ఎడమ కాలువ గండ్లను పూడ్చాలి: మంత్రి తుమ్మల
సాగర్ ఎడమ కాలువ గండ్లను యుద్ధ ప్రాతిపదికన పూడ్చాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. తుపాను ప్రభావంతో వరదల వల్ల నాగార్జున సాగర్ ఎడమ కాలువకు గండ్లు పడ్డాయని, కాలువ మరమ్మతు పనులు త్వరగా చేపట్టాలని తుమ్మల కోరారు. చివరి ఆయకట్టు రైతులకు నీరందించడామే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పనులను వేగవంతం చేయాలని తుమ్మల అన్నారు.
News September 19, 2024
వరద బాధితులకు నెల జీతం చెక్ అందించిన కూనంనేని
ఖమ్మం వరద బాధితులకు సహాయార్థం తన నెల జీతాన్ని అందజేస్తున్నట్లు కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. గురువారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి సీఎం రేవంత్ రెడ్డికి నెల జీతం చెక్కును అందజేశారు. సీఎం సహాయనిధి ద్వారా వరద బాధితులకు సహాయ సహకారాలు అందించాలని ఎమ్మెల్యే కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు సీఎం రేవంత్ ధన్యవాదాలు తెలిపారు.
News September 19, 2024
భద్రాద్రి జిల్లాలో తహశీల్దార్‌ల బదిలీలు
భద్రాద్రి జిల్లాలో పలు మండలాల తహసీల్దారులను బదిలీ చేస్తూ గురువారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఉత్తర్వులు జారీ చేశారు. టేకులపల్లి MRO నాగభవాని అశ్వాపురానికి, దమ్మపేట MRO నరేష్ పినపాకకు, బూర్గంపాడు MRO ముజాహిద్ టేకులపల్లికి, పినపాక MRO శ్రీనివాసరావు గుండాలకు, చుంచుపల్లి MRO కృష్ణ దమ్మపేటకు, గుండాల MRO ఇమ్మానుయేల్ బూర్గంపాడుకు, అశ్వాపురం MRO స్వర్ణ చుంచుపల్లికి బదిలీ అయ్యారు.