News February 27, 2026
“చద్దిలేని పయనం, ఒంటి ఎద్దు సేద్యం”

పూర్వం కాలినడకన, ఎడ్లబండ్ల మీద ప్రయాణాలు చేసేవారు. అప్పట్లో హోటల్స్ ఉండేవి కావు. అప్పుడు తిండి లేకుండా చాలా దూరం ప్రయాణించాల్సి వస్తే ఆకలితో అలమటించి నీరసించిపోయేవారు. అలాగే వ్యవసాయానికి జత ఎడ్లు ఉండాలి. ఒక ఎద్దు కట్టి పొలం దున్నడం అసాధ్యం. ఒకవేళ చేసినా అది కష్టంగా మారుతుంది. అందుకే ఏదైనా పనిని ప్రారంభించేటప్పుడు సరైన ప్రణాళిక, వనరులు, అవసరమైన సాయం లేకపోతే అది విజయవంతం కాదని ఈ సామెత చెబుతుంది.
Similar News
News April 16, 2026
కుప్పం: మళ్లీ నల్లకోటు వేసిన రెడ్డప్ప

చిత్తూరు మాజీ MP, వైసీపీ సీనియర్ నేత రెడ్డప్ప మళ్లీ నల్లకోటు ధరించి కుప్పం కోర్టుకు హాజరయ్యారు. మాజీ CM జగన్ CPRO శ్రీహరిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. YCP లీగల్ సెల్ పొన్నువోలు సుధాకర్ రెడ్డితోపాటు చిత్తూరు మాజీ MP రెడ్డప్ప శ్రీహరి తరపున వాదించేందుకు వచ్చారు. ఖద్దర్ చొక్కాలో కనిపించే రెడ్డప్ప నల్లకోటు ధరించి రావడంతో ఆయనతో వైసీపీ శ్రేణులు సెల్ఫీలు తీసుకున్నాయి.
News April 16, 2026
రాష్ట్రమంతటిపై ‘అమరావతి’ భారం: సజ్జల

AP: అమరావతి పేరుతో చంద్రబాబు రూ.వేలకోట్లు దోచుకుంటున్నారని YCP నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ‘CBN చేస్తున్నది సంపద సృష్టికాదు దోపిడీ. ఇతర చోట్ల ఇటువంటి నిర్మాణాలకు Sftకి ₹3వేలలోపు ఉంటే ఇక్కడ ₹14వేలు ఖర్చు చేస్తున్నారు. హైరైజ్డ్ పేరిట 40-50 అంతస్తులు కడుతూ మొబిలైజేషన్ అడ్వాన్సులిస్తున్నారు. ఇదంతా మోయలేని భారం. ఆ ఖర్చును రాష్ట్రమంతా భరించాలంటున్నారు’ అని పార్టీ BC నేతల భేటీలో విమర్శించారు.
News April 16, 2026
రామాయణ ఫైనల్ ఔట్‌పుట్ అదిరిపోతుంది: యశ్

‘రామాయణ’ VFXపై విమర్శలు వస్తున్న వేళ యశ్ కామెంట్స్ ఫ్యాన్స్‌లో అంచనాలు పెంచుతున్నాయి. ఈ మూవీకి పనిచేస్తున్నది ప్రతిష్ఠాత్మక DNEG కంపెనీ అని, ఫైనల్ ఔట్‌పుట్ అదిరిపోతుందని అన్నారు. గ్రాఫిక్స్ ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయన్నారు. కాగా DNEG డ్యూన్-2, టెనెట్, ఇంటర్‌స్టెల్లార్ వంటి బ్లాక్‌బస్టర్లకు గ్రాఫిక్స్ అందించింది. ఈ నేపథ్యంలో సినిమా ఔట్‌పుట్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.


