News February 12, 2025
చనిపోయేందుకు శ్రీశైలం వచ్చిన యువతి.. కాపాడిన పోలీసులు

ఆత్మహత్య చేసుకునేందుకు శ్రీశైలం వచ్చిన ఓ యువతిని స్థానిక పోలీసులు కాపాడారు. సీఐ ప్రసాదరావు వివరాల మేరకు.. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా మోచర్ల గ్రామానికి చెందిన ఉమామహేశ్వరి అనే యువతి ఆత్మహత్య చేసుకునేందుకు శ్రీశైలం వచ్చింది. పాతాళగంగ వద్ద తిరుగుతున్న ఆమెను పోలీస్ సిబ్బంది గురవయ్య, నాను నాయక్, నాగవేణి గుర్తించి వివరాలు తెలుసుకున్నారు. వారి బంధువులకు క్షేమంగా అప్పగించామని సీఐ తెలిపారు.
Similar News
News November 5, 2025
ANU దూరవిద్య యూజీ, పీజీ పరీక్ష ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం పరిధిలో ఈ ఏడాది జూలై, ఆగస్టు మాసాలలో జరిగిన పలు యూజీ, పీజీ కోర్సుల పరీక్ష ఫలితాలను దూరవిద్య కేంద్రం డైరెక్టర్ వంకాయలపాటి వెంకటేశ్వర్లు విడుదల చేశారు. బిబిఎం, బిహెచ్ఎం, బిబిఏ, ఇయర్ ఎండ్ సప్లమెంటరీ పరీక్ష ఫలితాలతో పాటు, ఎంఏ ఇంగ్లిష్, ఎంఏ సోషల్ వర్క్, మొదటి, ద్వితీయ, తృతీయ సెమిస్టర్, తదితర ఫలితాలను విడుదల చేశారు.
News November 5, 2025
పాలకుర్తి: ‘6 గ్యారంటీలు, 420 హామీలతో కాలయాపన’

రెండేళ్లుగా 6 గ్యారంటీలు, 420 హామీలతో గద్దెనెక్కి గొప్పలు చెప్పుకుంటూ ఇప్పటివరకు చేసింది ఏమీలేదని BRS పార్టీ పాలకుర్తి మండల అధికార ప్రతినిధి ములుకాల కొమురయ్య ఆరోపించారు. బుధవారం ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వంలో శంకుస్థాపన చేసిన రోడ్లను ఇప్పటి వరకు పూర్తి చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, సమ్మక్క సారలమ్మ గుడికి MLA రూ.50 లక్షలు మంజూరు చేసినా ఇప్పటికీ పనులు మొదలు పెట్టలేదన్నారు.
News November 5, 2025
జనవరిలో గగన్‌యాన్ ప్రాజెక్టు అన్‌క్రూడ్ మిషన్: ISRO ఛైర్మన్

ఇండియా ‘మానవ సహిత గగన్‌యాన్’లో భాగంగా అన్‌క్రూడ్ మిషన్‌ను జనవరిలో చేపట్టే అవకాశముందని ఇస్రో ఛైర్మన్ నారాయణన్ తెలిపారు. ఇప్పటికే 8వేల టెస్టులు నిర్వహించామన్నారు. 2027లో మానవ సహిత గగన్‌యాన్‌కు ముందు 3 అన్‌క్రూడ్ మిషన్లను చేపడతామని వివరించారు. భారత అంతరిక్ష కేంద్ర ఫస్ట్ మాడ్యూల్‌ను 2028లో లాంచ్ చేస్తామన్నారు. నాసాతో కలిసి రూపొందించిన NISAR శాటిలైట్ ఆపరేషన్‌పై శుక్రవారం ప్రకటన చేయనున్నట్లు చెప్పారు.


