News February 2, 2025

చనిపోయే ముందు తణుకు ఎస్ఐ చాటింగ్..?

image

తణుకు ఎస్‌ఐ మూర్తి ఆత్మహత్య కేసులో మిస్టరీ వీడలేదు. రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలోని బాత్రూం వద్ద ఆయన గన్‌తో కాల్చుకున్నారు. సూసైడ్ చేసుకునే ముందే ఆయన ఫోనులో ఎవరితోనో చాటింగ్ చేసినట్లు తెలుస్తోంది. సంబంధిత దృశ్యాలు స్టేషన్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయినట్లు సమాచారం. ప్రస్తుతం ఎస్ఐ ఫోన్‌ను పోలీసులు సీజ్ చేశారు. ఆ చాటింగ్ బయట పెడితేనే వాస్తవాలు వెల్లడవుతాయని బంధువులు అంటున్నారు.

Similar News

News September 19, 2025

నల్గొండ: ‘నా కోరిక తీరిస్తే B.Ed పాస్ చేస్తా’

image

నల్గొండలోని డైట్ పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు B.Ed విద్యార్థినిని వేధించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన కోరిక తీరిస్తే B.Ed పాస్ చేయిస్తానని సదరు ఉపాధ్యాయుడు వేధింపులకు గురి చేస్తున్నట్లు సమాచారం. గతంలోనూ ఈ ఉపాధ్యాయుడు పాఠశాలలో చదువుతున్న బాలికలకు ముద్దులు పెట్టడం, వెకిలి చేష్టలకు పాల్పడటంతో అతడిని దేహశుద్ధి చేసినట్లు తెలిసింది. అతడిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

News September 19, 2025

రాజమండ్రి నుంచి తిరుపతికి విమాన సర్వీస్

image

రాజమండ్రి విమానాశ్రయం నుంచి దేశంలోని ప్రధాన నగరాలకు విమాన సర్వీసులు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ ఎన్.కె.శ్రీకాంత్ శుక్రవారం తెలిపారు. ఈ నేపథ్యంలో అక్టోబరు 1న తిరుపతికి విమాన సర్వీస్ ప్రారంభం అవుతుందని చెప్పారు. వారానికి మూడు రోజులు ఈ విమాన సర్వీసు నడుస్తుందని వెల్లడించారు.

News September 19, 2025

చీఫ్ ఇంజినీర్ ముందే బీఎన్ పనులు చేయలేమన్న కాంట్రాక్టర్

image

R&Bచీఫ్ ఇంజనీర్ (NDB) విజయశ్రీ ముందే రోడ్డు మరమ్మతులు చేయలేమని కాంట్రాక్టర్ చేతులెత్తేశారు. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ (NDB)నిధులతో నిర్మాణంలో ఉన్న జిల్లాలోని రోడ్లు శుక్రవారం పరిశీలించారు. బి.ఎన్ రోడ్డుపై ఏర్పడిన భారీ గుంతలును పూడ్చాలని కాంట్రాక్టర్ వెంకటేశ్వరావును ఆదేశించారు. ఇప్పటికే ఈ రోడ్డు పనులకు రూ.10 కోట్లు వెచ్చించామని ఇంతవరకు ఈ బిల్లు ఇవ్వనందున ఇక పనులు చేయలేమన్నారు.