News April 7, 2025
చపాతీలు చేయలేదని చితకబాదిన టీచర్

చపాతీలు చేయనందుకు విద్యార్థినులను చితక్కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొత్తగూడెం టౌన్ రామవరం గిరిజన బాలికల గురుకులంలో 600 మంది విద్యార్థినులు ఉన్నారు. ఆదివారం ఉదయం 4 గంటలకు 8వ తరగతి విద్యార్థినులను చపాతీలు చేసేందుకు ఓ టీచర్ నిద్రలేపింది. కొందరు లేచి చపాతీలు చేస్తుండగా, 21 మంది విద్యార్థినులు నిద్ర లేవలేదు. ఆ సాకుతో ఈ 21 మందిని గదిలో కర్రతో చితక బాదిందని పేరెంట్స్ ఆందోళన చేశారు.
Similar News
News December 16, 2025
నేడు వర్షాలు!

AP: రాయలసీమ జిల్లాలను మళ్లీ వర్షాలు పలకరించనున్నాయి. బంగాళాఖాతం నుంచి తూర్పు గాలులు వీస్తుండటంతో తమిళనాడును ఆనుకొని ఉన్న రాయలసీమలో ఇవాళ అక్కడక్కడా వర్షాలు పడతాయని వాతావరణశాఖ అంచనా వేసింది. అటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో చలి ప్రభావం కొనసాగుతోంది. నిన్న అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు(M) కిలగాడలో 7.3డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మీ ప్రాంతంలో వాతావరణం ఎలా ఉందో COMMENT చేయండి.
News December 16, 2025
తిరుప్పావై కీర్తనలు ఆలపించే పద్ధతి

ధనుర్మాసంలో తిరుప్పావై పాశురాలను ఆలపిస్తే సుగుణాల భర్త వస్తాడని నమ్ముతారు. అయితే మొత్తం 30 పాశురాలు ఉంటాయి. రోజుకొకటి చొప్పున 30 రోజుల పాటు 30 పాశురాలను ఆలపించాలి. ఉదయాన్నే స్నానమాచరించి లక్ష్మీనారాయణులను పూజించాక ఈ పాశురాలను ఆలపించాలి. గోదాదేవి శ్రీకృష్ణుడిని మేల్కొలపడానికి తన చెలులతో కలిసి వీటిని ఆలపించింది. ధనుర్మాసంలో తిరుమలలో సుప్రభాతం బదులుగా తిరుప్పావై కీర్తనలే ఆలపిస్తారు.
News December 16, 2025
లంపీస్కిన్ నివారణకు మరో ఆయుర్వేద మందు

ఆయుర్వేద మందుతో <<18552983>>లంపీస్కిన్<<>> నుంచి పశువును కాపాడవచ్చు. రెండు వెల్లులి రెబ్బలు, 10గ్రా. ధనియాలు, 10గ్రా. జీలకర్ర, గుప్పెడు తులసి ఆకులు, 10గ్రా. బిర్యానీ ఆకులు, 10గ్రా. మిరియాలు, 5 తమలపాకులు, రెండు ఉల్లిపాయలు, 10 గ్రా. పసుపు, 10గ్రాముల వాము, గుప్పెడు తులసి ఆకులు, గుప్పెడు వేపాకులు, గుప్పెడు బిల్వపత్రం ఆకులు, 10గ్రాముల బెల్లం తీసుకొని వీటిని మిశ్రమంలాగా చేసి వారం రోజుల పాటు రోజుకు ఒకసారి తినిపించాలి.


