News November 20, 2024
చరిత్రకు ఆనవాళ్లు .. ఉదయగిరి కోట

నెల్లూరు జిల్లాలోని ప్రధాన చారిత్రక ప్రదేశాల్లో ఉదయగిరి కోట ఒకటి. వెయ్యేళ్ళనాటి ఈ కోటకు 11వ శతాబ్దంలో ఉదయగిరి పాలకులుగా ఉన్న పల్లవులు పునాదులు వేశారు. 13వ శతాబ్దంలో లంగూళ్ల గజపతి కోట నిర్మాణాన్ని పూర్తి చేశారు. గుర్రపు నాడా ఆకారంలో ఉన్న లోయలో ఈ కోటను నిర్మించారు. ఉపరితలం నుంచి పరిశీలిస్తే కోట రూపం నిద్రిస్తున్న మనిషి ఆకారంలో ఉంటుంది. చుట్టూ జలపాతాలు, ఔషధ మొక్కలతో కూడిన వనాలతో సుందరంగా ఉంటుంది.
Similar News
News November 17, 2025
అల్లూరు: బొలేరో వాహనం బోల్తా.. ఇద్దరు మృతి

అల్లూరు(M) సింగపేట వద్ద భవన నిర్మాణ కార్మికులు వెళుతున్న బొలేరో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను కావలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఎస్సై శ్రీనివాసరెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తులు కావలి(M) బట్లదిన్నెకు చెందిన శీనయ్య, ప్రసాద్గా గుర్తించారు.
News November 17, 2025
నెల్లూరు: కరెంట్ సమస్యలు ఉన్నాయా?

విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం డయల్ యువర్ CMD నిర్వహిస్తున్నట్లు APSPDCL ఛైర్మన్&ఎండీ శివశంకర్ తెలిపారు. నెల్లూరు జిల్లాతోపాటు రాయలసీమ జిల్లాల ప్రజలకు కరెంట్ సమస్యలు ఉంటే సోమవారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు 89777 16661కు కాల్ చేయాలని సూచించారు. వీటితోపాటు 1912, వాట్సాప్ నంబర్ 91333 31912 ద్వారానూ ఫిర్యాదు చేయవచ్చన్నారు.
News November 16, 2025
రేపు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్న కలెక్టర్

ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కలెక్టరేట్లో సోమవారం PGRSను నిర్వహించనున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ఈ వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమం సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు.


