News November 20, 2024

చరిత్రకు ఆనవాళ్లు .. ఉదయగిరి కోట

image

నెల్లూరు జిల్లాలోని ప్రధాన చారిత్రక ప్రదేశాల్లో ఉదయగిరి కోట ఒకటి. వెయ్యేళ్ళనాటి ఈ కోటకు 11వ శతాబ్దంలో ఉదయగిరి పాలకులుగా ఉన్న పల్లవులు పునాదులు వేశారు. 13వ‌ శతాబ్దంలో లంగూళ్ల గజపతి కోట నిర్మాణాన్ని పూర్తి చేశారు. గుర్రపు నాడా ఆకారంలో ఉన్న లోయలో ఈ కోటను నిర్మించారు. ఉపరితలం నుంచి పరిశీలిస్తే కోట రూపం నిద్రిస్తున్న మనిషి ఆకారంలో ఉంటుంది. చుట్టూ జలపాతాలు, ఔషధ మొక్కలతో కూడిన వనాలతో సుందరంగా ఉంటుంది.

Similar News

News December 9, 2024

మరోసారి ఎంపీగా బీదకు ఛాన్స్..?

image

కావలికి చెందిన బీద మస్తాన్ రావు వైసీపీ, రాజ్యసభ ఎంపీ పదవికి ఇటీవల రాజీనామా చేసి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. దీంతో ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. మరోసారి రాజ్యసభ ఎంపీగా బీదకే టీడీపీ అధిష్ఠానం అవకాశం ఇచ్చిందని సమాచారం. రేపు సాయంత్రంతో నామినేషన్ గడువు ముగియనుంది. ఇవాళ సాయంత్రం లేదా రేపు ఉదయం లోపు టీడీపీ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

News December 9, 2024

నెల్లూరు: 11న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

image

నెల్లూరు జిల్లాలో సాగునీటి సంఘాల ఎన్నికల ప్రక్రియకు 4వ సారి కలెక్టర్ కార్యాలయం షెడ్యూల్ విడుదల చేసింది. ఈనెల 11న నోటిఫికేషన్ విడుదల చేస్తామని కలెక్టర్ ఆనంద్ వెల్లడించారు. జిల్లాలోని ఇరిగేషన్, సోమశిల, తెలుగుగంగ ప్రాజెక్టుకు సంబంధించి 6 ప్రాజెక్టు కమిటీలు, 13 డిస్ట్రిబ్యూటరీ కమిటీలకు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. వీటితోపాటు 490 వాటర్ యూజర్స్ అసోసియేషన్లు, 3698 టీసీలకు ఎన్నికలు జరుగుతాయి.

News December 9, 2024

వ్యభిచారం చేయిస్తున్న నెల్లూరు జిల్లా వాసి అరెస్ట్

image

నెల్లూరు జిల్లా మర్రిపాడుకు చెందిన శ్రీరాములు, తిరుపతిలోని ఎర్రమిట్టకు చెందిన ఓ మహిళ తిరుపతి రైల్వేకాలనీలో ఇంటిని బాడుగకు తీసుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి అక్కడ వ్యభిచారం చేయిస్తున్నారు. పక్కా సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. కోస్తా అమ్మాయిలు దొరకగా.. వాళ్లను హాస్టల్‌కు తరలించారు. మహిళతో పాటు శ్రీరాములును అరెస్ట్ చేశామని తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్ సీఐ రామకృష్ణ తెలిపారు.