News November 20, 2024
చరిత్రకు ఆనవాళ్లు .. ఉదయగిరి కోట

నెల్లూరు జిల్లాలోని ప్రధాన చారిత్రక ప్రదేశాల్లో ఉదయగిరి కోట ఒకటి. వెయ్యేళ్ళనాటి ఈ కోటకు 11వ శతాబ్దంలో ఉదయగిరి పాలకులుగా ఉన్న పల్లవులు పునాదులు వేశారు. 13వ శతాబ్దంలో లంగూళ్ల గజపతి కోట నిర్మాణాన్ని పూర్తి చేశారు. గుర్రపు నాడా ఆకారంలో ఉన్న లోయలో ఈ కోటను నిర్మించారు. ఉపరితలం నుంచి పరిశీలిస్తే కోట రూపం నిద్రిస్తున్న మనిషి ఆకారంలో ఉంటుంది. చుట్టూ జలపాతాలు, ఔషధ మొక్కలతో కూడిన వనాలతో సుందరంగా ఉంటుంది.
Similar News
News March 11, 2026
మత్స్య పరిశోధన కేంద్రాల స్థాపన కోసం నిధులు ఏర్పాటుపై ఎంపీ ఆరా

ఏపీలో అదనపు మత్స్య పరిశోధన కేంద్రాలను స్థాపించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, గత మూడేళ్లలో కేటాయించిన నిధులపై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఆరా తీశారు. లోక్‌సభలో మంగళవారం ఈ అంశంపై వివరాలు కోరారు. కేంద్ర మత్స్య, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఏపీలో నాలుగు ప్రాంతీయ మత్స్య పరిశోధన కేంద్రాలు ఉన్నాయన్నారు.
News March 10, 2026
కావలి: మామిడి తోటలో ఉరి వేసుకొని వ్యక్తి మృతి

కావలి రూరల్ మండలం తాళ్లపాలెం గ్రామానికి చెందిన నూకల పాటి శివప్రసాద్ రెడ్డి (65) మంగళవారం మామిడి తోటలో చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందాడని రూరల్ పోలీసులు తెలిపారు. మృతుడి భార్య లక్ష్మి కాంతమ్మ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుమల్ రెడ్డి తెలిపారు. అనారోగ్య కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
News March 10, 2026
నెల్లూరు: మహిళ దారుణ హత్య

నెల్లూరు వనంతోపు సెంటర్‌కు చెందిన వెంకయ్య, తన భార్య హజరత్తమ్మ (41)ను రాయితో తలపై కొట్టి దారుణంగా హత్య చేశాడు. వీరు పల్నాడు జిల్లా నరసరావుపేట(M) ఇసప్పాలెం మహంకాళి తిరునాళ్లకు వెళ్లారు. ఆ సమయంలో ఘర్షణ చోటుచేసుకుని హత్య చేసినట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు నరసరావుపేట పోలీసులు స్పందించి, నిందితుడు వెంకయ్యను అదుపులోకి తీసుకున్నారు. పాత సామాన్లు ఏరుకుంటూ జీవనం సాగించేవారని గుర్తించారు.


