News February 19, 2025
చరిత్ర సృష్టించి 11 ఏళ్లైంది: హరీశ్రావు

స్వరాష్ట్ర సాధన కోసం ఉవ్వెత్తున ఉద్యమించిన తెలంగాణలో సరిగ్గా 11 ఏళ్ల క్రితం నవ చరిత్రకు పునాది పడింది. 2014 ఫిబ్రవరి 18న లోక్సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందింది. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఫలించిన రోజది. దేశ చరిత్రలోనే మైలురాయిగా నిలిచిన ఆ సందర్భాన్ని గుర్తుచేస్తూ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు మంగళవారం ట్వీట్ చేశారు.
Similar News
News February 22, 2025
రామాయంపేటలో చిరుత సంచారం.. ఆందోళనలో రైతులు

రామాయంపేట శివారులోని జాతీయ రహదారి సమీపంలో చిరుత పులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. జాతీయ రహదారి పక్కన ఉన్న 1421 సర్వే నంబర్లోని వ్యవసాయ పొలం వద్ద గత రాత్రి లేగ దూడపై చిరుత దాడి చేసి చంపేసింది. ఉదయం లేగదూడను చూసిన స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలం చేరుకున్న ఫారెస్ట్ అధికారులు విచారణ చేపట్టారు.
News February 22, 2025
ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మెదక్- నిజామాబాద్-ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గం సంబంధించిన ఏర్పాట్లపై మాట్లాడారు. డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలు ఏర్పాటు, పోలింగ్ స్లిప్పులు పంపిణీ పూర్తి చేయాలన్నారు. పోలింగ్ ఈనెల 27న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుందని తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పటిష్టంగా ఉండాలన్నారు.
News February 22, 2025
మెదక్: అనుమానాస్పదంగా వ్యక్తి మృతి

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం కామారెడ్డి జిల్లా బిక్కనూర్లో జరిగింది. హవేలిఘనపూర్ మండలం గంగాపురానికి చెందిన శ్రీనివాస్ ఓ శుభకార్యం నిమిత్తం బిక్కనూరులోని అత్తగారింటికి వచ్చాడు. శుక్రవారం మద్యం తాగి ఆరు బయట పడుకున్న శ్రీనివాస్ తెల్లవారుజామున భార్య సరిత వచ్చి నిద్రలేపగా లేవలేదు. స్థానికులు వచ్చి చూడగా అప్పటికే మృతిచెంది ఉన్నాడు. కాగా మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.