News September 10, 2024

చర్లకోల లక్ష్మారెడ్డి ఇంట్లో విషాదం

image

మాజీ మంత్రి చర్లకోల లక్ష్మారెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది. లక్ష్మారెడ్డి భార్య శ్వేతారెడ్డి సోమవారం రాత్రి మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. NGKL జిల్లా తిమ్మాజీపేట మండలం ఆవంచలో నేడు మధ్యాహ్నం 3 గంటలకు అంత్యక్రియలు జరగనున్నాయి. ఆమె మరణంతో నియోజకవర్గంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News

News November 17, 2025

బాలానగర్‌లో 9.9 ఉష్ణోగ్రత నమోదు

image

మహబూబ్ నగర్ జిల్లాలో చలి తీవ్రత రోజుకు పెరిగిపోతుంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాలానగర్‌లో 9.9 డిగ్రీల అత్యంత ఉష్ణోగ్రత నమోదయింది. రాజాపూర్ 10.2, గండీడ్ మండలం సల్కర్ పేట, మిడ్జిల్ 10.5, హన్వాడ 11.3 కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 11.4, భూత్పూర్ 11.6, కోయిలకొండ మండలం పారుపల్లి 11.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.

News November 17, 2025

వాహనదారులు జాగ్రత్తగా ఉండాలి: MBNR SP

image

శీతాకాలంలో వాహనదారులు జాగ్రత్తగా వాహనాలు నడపాలని మహబూబ్ నగర్ SP జానకి సూచించారు. చలికాలంలో పొగ మంచు కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు కనపడని కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందన్నారు. రాత్రి, తెల్లవారుజామున ప్రయాణాలను తగ్గించుకోవడం మంచిదని వివరించారు. బైక్ నడిపై వారు తప్పనిసరిగా హెల్మెట్, చేతులకు గ్లౌజులు ధరించాలన్నారు.

News November 16, 2025

MBNR:U-14..18న వాలీబాల్ ఎంపికలు

image

మహబూబ్ నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో అండర్-14 విభాగంలో బాల, బాలికలకు వాలీబాల్ ఎంపికలను నిర్వహించనున్నట్లు కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి ‘Way2News’తో తెలిపారు. మహబూబ్ నగర్ నగర్ లోని DSA స్టేడియంలో ఈ నెల 18న ఎంపికలు ఉంటాయని, ఒరిజినల్ బోనఫైడ్, ఆధార్‌ జిరాక్స్ లతో ఉ.9:00 గంటలలోపు రిపోర్ట్ చేయాలన్నారు. క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
#SHARE IT.